గ్రామ రెవెన్యూ సహాయకుల సదస్సును విజయవంతం చేయాలి

*
మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్.
(జనంసాక్షి) ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల నేటి సదస్సును విజయవంతం చేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం ఈనెల 25 లోపు నెరవేర్చని యెడల నిరవధిక సమ్మె చేయుటకు అందరూ తీర్మానించుకున్నారు. సోమవారం జరిగే వీఆర్ఏల ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సదస్సును విజయవంతం చేయాలని కోరారు.అనంతరం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్ఎల కు పే స్కేల్ వర్తింపు చేయాలని, 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. అలాగే సొంత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల వంటి హామీలు ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజులలో వీఆర్ఏలు ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దబ్బెట రాజు, సహాయ కార్యదర్శి వేణు వంక రమనాచారి, భోగం సాంబయ్య, సరస్వతి ,సురేష్, సదయ్య, ఆనందం, లక్ష్మయ్య, రాజు, చిరంజీవి, కృష్ణ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area