గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులు సరైన సమయంలోపరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 12
   ఈనెల 16న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులు ఉదయం 10:00 గంటలకు పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఆ తరువాత ఒక్క నిమిషము ఆలస్యమైన అనుమతించబొమని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై టి యస్ పి యస్ సి చైర్మన్ డాక్టర్ పి. జనార్దన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ పోలీస్ అధికారులతో లతో వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, గ్రూప్ -1 పరీక్షలు అక్టోబర్,16 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు రెండు గంటల ముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని, గ్రూప్ -1 పరీక్షలకు తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందన్నారు.  ఉదయం 10:00 గంటల తర్వాత పరిక్షా కేంద్రములో అనుమతించబడదని, 10:15 గంటలకు పరిక్షా కేంద్రం గేటు మూసివేయడం జరుగుతుందన్నారు.  10 సంవత్సరాల తరువాత గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి పరీక్షలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరవుతున్నందున పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.  జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్ తో పాటు ప్రతి పరిక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  స్ట్రాంగ్ రూం, పరిక్షా కేంద్రంలోని గేట్ ఏంట్రన్స్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లలో సీసీ కెమెరాలను, వీడియో కవరేజ్ ఏర్పాటు చేయాలన్నారు.    స్ట్రాంగ్ రూమ్ నుండి పరిక్షా కేంద్రానికి పరీక్ష మెటీరియల్ ను పోలీస్ బందోబస్తు తో సకాలంలో చేర్చాలన్నారు.  పరిక్షా పూర్తి అయ్యేవరకు పాటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలాన్నారు.  ఈరోజే చీఫ్ సూపరింటెండెంట్ లతో కలసి సంబంధిత లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు పరిక్షా కేంద్రాలను సందర్శించి విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుద్యం, నీటి సదుపాయాల ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.  పరిక్షా సమయంలో విద్యుత్ అంతరాయం జరుగకుండా చూడాలని, పరిక్షా కేంద్రాల పరిసరాలలో గల జిరాక్స్ సెంటర్ లను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు. ఆర్ టి సి బస్సులను సకాలంలో నడపాలని అన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నం. 7995061192 కు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు సంప్రదించగలరని తెలిపారు.  ఎలాంటి పొరపాట్లు జరుగకుండా గ్రూప్ -1 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను కోరారు.
  ఈ సమావేశంలో అడిషనల్ యస్ పి రషీద్, డి ఆర్ ఓ అశోక్ కుమార్, ఆర్ డి ఓ విజయకుమారి, డి ఎస్ పి సత్యనారాయణ, చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.