గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు

` ప్రకటించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్‌ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండిరగ్‌లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.