*ఘనంగా అమ్మవారికి పుష్పర్శన*

మెట్ పల్లి ,సెప్టెంబర్29:
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పూజలో భాగంగా ఓంకారేశ్వర దేవాలయం నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రకరకాల పూలతో ఊరేగింపు గా వచ్చి అమ్మవారికి ఘనంగా పూలాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ, మనోహర శర్మ,రాజేంద్ర శర్మ, ఉపేంద్ర శర్మ, ఆదిత్య శర్మ లు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవాచన-స్థాపిత ఆజ్యాభిషేకం,
కుంకుమార్చన, పుష్పార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాదం వితరణ సాయంత్రం సప్తశతీ పారాయణం, వేద పారాయణం, శ్రీ చక్రార్చన మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట సుమన్, కార్యదర్శి ముక్క పవన్,కోశాధికారి ర్యాగెల శ్రీను,వాసవి దేవాలయ అధ్యక్షులు వెలగందుల తిరుపతి, మంచాల శ్రీమాన్, పిప్పరి నవీన్, బాశెట్టి హరీష్, పాంపట్టి ఆనంద్ కుమార్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.