ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.
జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 27:
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అన్నారు. జీవితాంతం బాపూజీ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికావాదిగా, అణగారిన వర్గాల నాయకుడిగా, నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనమని ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అనంతరం డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గంలో పుట్టి మహాత్మా గాంధీ తరువాత బాపూజీగా పిలిపించుకుని జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారన్నారు. స్వాతంత్ర్యోద్యమం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేఖ పోరాటం తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటవీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పోరాటాలే ఊపిరిగా పదవులను, ఆస్తులను తృణప్రాయంగా వదులుకుని జీవితాంతం అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, సహకార రంగాల ప్రతిష్టతకు కృషి చేశారన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారని దాసరి ప్రవీణ్ కుమార్ నేత అన్నారు.ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి, చిగురుమామిడి సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, గాగిరెడ్డిపల్లి సర్పంచ్ సన్నీళ్ళ వెంకన్న, మండల పరిషత్ సూపరెండింట్ ఖాజా