ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన
ఎంపీపీ బన్సోడ రాణిభాయ్ రామారావు
మహదేవపూర్ సెప్టెంబర్ 27 ( జనంసాక్షి )
మహాదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు బన్సోడ రాణి భాయ్ రామారావు మంగళవారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ బన్సోడ రాణి భాయ్ రామారావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అణిచివేత నుంచి, విముక్తి కల్పించడానికి న్యాయకోవిధ పట్టా పుచ్చుకున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయ సమరం సాగించారని గుర్తు చేశారు.
హైదరాబాదులోని లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో పురుడుపోసుకున్నదని, అలాగే లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎంపీపీ బన్సోడ రాణి భాయ్ రామారావు వివరించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ నిర్మాణానికి కృషిచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు
ముందుగా కాటారం సబ్ డివిజన్ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాదె రమేష్ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర, జయంతి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలిపారు. అనంతరం బాపూజీ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా అవార్డు పొందిన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన పంతకాని రాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి గుడాల అరుణ . తహసిల్దార్ శ్రీనివాస్ .ఎం పి డి ఓ శంకర్ నాయక్ . ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్, డాక్టర్ స్వాతి, ఎం పి ఓ ప్రసాద్, మండల పద్మశాలి సంఘం కన్వీనర్ దశరథం, పంతకాని సమ్మయ్య, శ్రీనివాస్, పినగాని రమేష్, డాక్టర్ సతీష్, జయంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.