ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు పెద్దముప్పారం పద్మశాలి సంఘం భవనం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బాపూజీ ఆది గురువన్నారు .1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవి కి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమించిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మలి దశ ఉద్యమం లో కూడా ఆయన పాత్ర ప్రత్యేక మైనది 97 సంవత్సరాల వయసులో ఎముకలు కొరికే చలిలో కూడా ఢిల్లీ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శాంతియుతంగా దీక్ష చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్నారు.అనంతరం పద్మశాలి సంఘము సభ్యులు బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడిచి నలుగురికి ఆదర్శంగా ఉండాలని బాపూజీ ని స్మరించుకొన్నారు. పెద్దముప్పారం గ్రామంలోని అమ్మఒడి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు,పులిహోర ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘo మండల అధ్యక్షుడు యెన్నం జనార్దన్,చలమల్ల వెంకటేశ్వర్లు,అంకం సోమేశ్,మిట్టకొల సత్యనారాయణ, యాకనాదం,నారాయణ, పద్మశాలి సంఘo సభ్యులు తదితరులు పాల్గొన్నారు.