ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
ఝరాసంగం, అక్టోబర్ 2 (జనంసాక్షి) మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంతోపాటు మచు నూరు కుప్పా నగర్, ఈదుల పల్లి, తుమ్మన్ పల్లి, బర్డిపూర్,ఎల్గోయి కొల్లూరు, గుంతమర్పల్లి, నర్సాపూర్,,గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ లు జాగదీశ్వర్, రాజు, లక్ష్మి బాయి, బస్వరాజు పాటిల్, నవాజ్ రెడ్డి ఓం ప్రకాష్ పాటిల్, శివ లక్ష్మి కృష్ణ, సావిత్రి బస్వరాజు పాటిల్, మోహన్ రెడ్డి శశిరేఖ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసిలు శంకర్ పాటిల్,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.