ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

శివ్వంపేట సెప్టెంబర్ 16 జనంసాక్షి : తెలంగాణ జాతీయ సమ్మెక్యత వజ్రోత్సవాలల్లో భాగంగా మండల పరిధిలోని గ్రామాలతో పాటు మండల కేంద్రమైన శివ్వంపేట నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ కు పెద్ద ఎత్తున టీఆరెఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా నర్సాపూర్ కు ర్యాలీగా  శుక్రవారం తరలి వెళ్లారు.  మండల తెరాస పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఆధ్వర్యంలో  మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చిన్నగొట్టిముక్ల  చౌరస్తా చేరుకొని వారికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్  జడ్పిటిసి పబ్బ మహేష్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి  పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ లో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలన దశకు పరివర్తన చెందిన రోజు అని సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజని 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ శ్రీశైలం యాదవ్, బాలమణి నరేందర్,  అశోక్ రెడ్డి, లక్ష్మీ పోచయ్య, బోళ్ల భారతి బిక్షపతి, అనూష అశోక్ గౌడ్, స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, హరికిషన్ రావు, రాజు నాయక్, పార్వతి సత్యం, బాబురావు, శ్యామల వెంకటేష్ ఎంపీటీసీలు నరసింహారెడ్డి, దశరథ్, లక్ష్మి కుమార్, సత్తిరెడ్డి, వాణి రామ్మోహన్ రెడ్డి ఇందిరా శ్రీనివాస్, లాయక్, నాయకులు మన్నే నర్సింలు, నాగేశ్వరరావు, పులిమామిడి నవీన్ గుప్తా, రవీందర్ గౌడ్, పిల్లుట్ల గంగాధర్, కె.రవీందర్ గౌడ్, రాంచందర్ గౌడ్, పిట్ల సత్యనారాయణ, రవి నాయక్ లతో పాటు వివిధ గ్రామాల నాయకులు ప్రజాప్రతినిధులు ఐకెపి సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి బయలుదేరారు. అదేవిధంగా (అలీ అకాడమీ నేవి దొంతి) విద్యార్థులు డ్రెస్ కోడ్ తో చూపురులకు జాతీయ జెండాలను పట్టుకొని సెంట్రల్ అట్రాక్షన్ గా కనిపించారు.