ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ఐదవ రోజు అన్నపూర్ణ దేవిగా అమ్మవారు
లోకేశ్వరం ( జనం సాక్షి) మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహిళలు మంగళహారతులతో పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఐదవ రోజైన అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈరోజు అమ్మవారికి రాజోపచార పూజలు, చతు షష్టి పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు రాజేశ్వర్ చారి తెలిపారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదరూపకంగ చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు