ఘనంగా పంద్రాగస్టు వేడుకలు.

– శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు,

 

– దేశభక్తి నినాదాలతో మారుమోగిన కురవి మండలం

 

కురివి ఆగస్టు-15

(జనం సాక్షి న్యూస్)

 

కురవి మండల వ్యాప్తంగా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పూర్తి చేసుకుని 76వ స్వాతంత్ర వేడుకలను మండల కేంద్రంలో, గ్రామ గ్రామాన అధికార, అనధికారికంగా ప్రతి పౌరుడు  మువ్వెన్నెల జెండాను ఎగరవేసి జాతీయతను చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జండా ఆవిష్కరణలో వెసులుబాటు కలిగిస్తూ, కాంక్షలను ఎత్తివేయడం మల్ల 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతీయతను చాటుకుంటూ 76వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. పురవీధులలో విద్యార్థులు మువ్వన్నెల జెండాను చేత బూని దిక్కులు పిక్కటిల్లెల జాతీయతను పెంపొందించే నినాదాలు చేస్తూ, అమర వీరులను స్మరించు కోవడం జరిగింది. ప్రతి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నందు ప్రజా ప్రతినిధులు జెండా ఆవిష్కరించగా, అంగన్వాడిలలో, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, యూనిట్ బాధ్యులు జండా ఎగరవేశారు. కురవి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ ఇమాన్యుయల్, ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్, మేజర్ గ్రామపంచాయతీ నందు సర్పంచ్ నూతక్కి పద్మ నర్సింహారావు, ఆలయమునందు ఈవో సత్యనారాయణ, పోలీస్ స్టేషన్ నందు ఎస్సై బి రాము నాయక్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, ప్రభుత్వ హాస్పిటల్, హాస్టల్లో, యూనిట్ బాధ్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో జండాలను ఎగరవేసి జాతీయతను చాటుకున్నారు. పలువురు నేతలు, అధికారులు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో పాలు పంచుకొని 75వ వసంతం నుండి 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.  ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వేచ్ఛ,  స్వాతంత్రాలను అనుభవిస్తున్నామని అన్నారు. పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరస్వతి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ యాకూబి రంజాన్, కురవి యంపిటి సి భాస్కర్, నారాయణపురం యంపిటిసి అర్జున్,యంపివో పధ్మ,ఏపిఓ యాకాంబ్రం,ఏపియం కిరణ్, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, వార్డు  సభ్యులు, పుర ప్రముఖులు, కార్యాలయాల సిబ్బంది, ఎంపీటీసీలు, విద్యార్థులు, డ్వాక్రా ,అంగన్వాడి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..