ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
వేములవాడ రూరల్, సెప్టెంబర్ 17 (జనం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవి కిషోర్, ఉపాధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్, మల్లికార్జున్, అంజనీ కుమార్, వెంకటేష్, మల్లారం తిరుపతి, అశోక్, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు