ఘనంగా ప్రారంభమైన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు

 వేడుకలకు హాజరైన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్,మంత్రులు శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్..
– కాకతీయుల వారసుడికి ఖిలా వరంగల్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
ఫోటో రైటప్: కాకతీయ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వారసుడు కమల్ చంద్రకు అపూర్వ స్వాగతం పలికిన మంత్రులు ఎమ్మెల్యేలు..
వరంగల్ బ్యూరో: జూలై  7 (జనం సాక్షి)
వరంగల్ కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో బాగంగా ఖిలా వరంగల్ కు విచ్చేసిన కాకతీయుల వారసుడు,బస్తర్
మహరాజు కమల్ చంద్ర భంజ్ దేవ్  కి వరంగల్ తూర్పు ఖిలా వరంగల్ లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు.
మంత్రులు శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్,ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,మేయర్ గుండు సుదారాణి,కుడా చైర్మన్ సుందర్ రాజ్,లు హాజరయ్యారు..ఖిలా వరంగల్ మెట్టు దర్వాజనుండి డప్పుచప్పుల్లు,కళాకారుల నృత్యాలు,బోనాలు, గుర్రాలబండి రథం పై కాకతీయ వారసుడు కమల్ చంద్రభంజ్ దేవ్ ను ఊరేగింపుగా తీసుకువెల్లారు..కాకతీయుల నాటి కట్టడాలను,శిల్పాలను పరిశీలిస్తూ ముందుకు కదిలారు..ఖిలా వరంగల్ లోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవతో చేసిన ఏర్పాట్లు అందరిని ఆకట్టుకున్నాయి.ఘనంగా డప్పు,డోలు వాయిద్యాలు,కోలాటాలు,కళాకారుల నృత్యాలతో ఖిలా వరంగల్ సందడిగా మారింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కాకతీయల కళావైభవానికి నెలవు వరంగల్ ప్రాంతమన్నారు..వారి అద్బుతమైన కళాసంపద ఇక్కడ కండ్ల ముందే ఉందన్నారు..తెలంగాణా ఏర్పాటు తర్వాత వరంగల్ చరిత్ర,కాకతీయుల కళావైభవాన్ని గుర్తుచేస్తూ ప్రతీ ఏటా ఘనంగా కాకతీయ ఉత్సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్నారన్నారు..వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ రావటం సంతోషంగా ఉందని,వారికి ఘనస్వాగతం పలికాలని అద్బుతంగా ఏర్పాట్లు చేసామన్నారు..కాకతీయుల చరిత్ర కలిగిన ఈ ఖిలా వరంగల్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కే.టీ.ఆర్ గార్ల సహకారంతో టూరిజం హబ్ గా మార్చుతామన్నారు..
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,ఇతర ప్రజాప్రతినిదులు,అదికారులు,అన్ని విబాగాల ప్రతినిదులు,కార్యకర్తలు,మహిళలు,ప్రజలు పాల్గొన్నారు..