*ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు*
మునగాల, అక్టోబర్ 02(జనంసాక్షి): స్థానిక మునగాల మండలంలోని గాంధీ పార్క్ లో బాపూజీ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్ముని సేవలు మరువలేనిమని ఆర్యవైశ్య పెద్దలు అన్నారు. గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య పెద్దలు, వాసవి సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేదలకు, పేదలకు మిఠాయిలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మునగాల మండల అధ్యక్షులు పొతుగంటి శ్రీనివాస్, వాసవి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ వంగవేటి వెంకటగురుమూర్తి, వాసవి క్లబ్ అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, ఆర్యవైశ్య పెద్దలు నల్లపాటి శ్రీనివాస్, కందిబండ సత్యనారాయణ, అర్వపల్లి శంకర్, వాసా శ్రీనివాసరావు, నల్లపాటి నాగరాజు, కందిబండ మంగేష్, చక్క కిషోర్, అర్వపల్లి రామారావు, కందిబండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.