ఘనంగా మానసిక వికలాంగుల ఆరోగ్య దినోత్సవం

 నల్గొండ,జనం సాక్షి.
             రాస్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు నెలవారీ కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా మహిళా, శిశు, వయో వృద్దుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ, నల్లగొండ వారి సంయుక్త ఆద్వర్యం లో సోమవారం , “మానసిక వికలాంగుల ఆరోగ్య దినోస్తవం”  సందర్బంగా మదర్ తెరెసా (నిర్మలా హృదయ్),నల్గొండ లో మానసిక వికలాంగుల చట్టలపై అవగాహన కార్యక్రమం   నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో  మానసిక వికలాంగుల హక్కులు వారి సంక్షేమం గురించి, ప్రభుత్వం తరుపున వారికి అందిస్తున్న సదుపాయాలను గురించి ఆశ్రమం నిర్వాహకులకు తెలియజేసారు.ఈ సందర్బంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. దీప్తి మాట్లాడుతూ మానసిక వికలాంగుల ను నిర్లక్షం చేయకుండా వారి హక్కులకు భంగం కలిగించకుండా చూడవలిసిన బాద్యత సమాజం లో ప్రతివొకరికి వుందని వారి పట్ల ఆదరాభిమానాలు చూపాలని వారు మానసిక ఉల్లాసంతో  ఉండేలా చూడాలని తెలిపారు.    వారికి ప్రభుత్వం తరుపున వున్న పథకాలు, వసతులు సక్రమంగా అందేలాగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ సంభందిత   సిబ్బంది మరియు ఆశ్రమం నిర్వాహకులు సిస్టర్ జోయ జోసెఫ్ పాల్గొన్నారు. అకాడ ఉన్న మానసిక వికలాంగులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున పండ్లు పంపిణీ చేశారు.