ఘనంగా మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు
కోటగిరి అక్టోబర్ 9 జనం సాక్షి:-మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారంలో మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు ఘనంగా జరిగాయి.శనివారం రోజు రాత్రి గ్రామ మత పెద్దలు,ప్రజల అధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జల్సా వేడుకలు కన్నుల పండుగ గా కొనసాగాయి.ఈ సందర్భంగా శనివారం రాత్రి జరిగిన వేడుకలకు బోధన్ ఏ.సి.పి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ మత పెద్దలు,ప్రజలకు మిలాదున్ నబీ జల్సా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో మహమ్మద్ ప్రవక్త తెలిపిన ధార్మిక విషయాలు,సూక్తులు,బోధనల పై పలువురుకి పాటలు,ఉపన్యాస పోటీలు నిర్వహించగా అందులో అత్యున్నత ప్రతిభ కనిపించిన వారికి బహుమతుల ను ప్రదానం చేశారు.ఈ వేడుకలలో స్థానిక సర్పంచ్ శేరు,రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎం.ఏ రజాక్,ఎస్.ఐ రాము, మండల కో ఆప్షన్ ఇస్మాయిల్,గ్రామ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు,నాయకులు,గ్రా మస్థులు,తదితరులు పాల్గొన్నారు