ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 27
దేశం గర్వించదగ్గ గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శంకర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల పురస్కరించుకుని, తాసిల్దార్ కార్యాలయంలో, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ గూడూరి శ్రీనివాస రావు , కాచాపూర్ సర్పంచ్ కొండ్ర రాజయ్య, ఆర్ఐ అరుణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తుమ్మ రఘుపతి, టిఆర్ఎస్ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.