ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 17 (జనం సాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ అధ్యక్షులు గాయత్రి జ్ఞానపీఠాధిపతులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆధ్వర్యంలో.శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు హోమములు జరిపించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ వారి తరఫునుంచి 15 మంది నిరుపేద విశ్వబ్రాహ్మణులకు నిత్యవసర సరుకుల కిట్లను శివకామేశ్వరి గ్రూప్స్ సహకారంతో మరో 10 మంది చేతివృత్తి వారికి నిత్యవసర కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలలో విశ్వకర్మ దేవుడిని బ్రహ్మ కుమారుడని చెప్పబడుతుంది. అతను స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం, యమపురి, కుబేరపురి మొదలైన వాటిని ఎంతో అందంగా నిర్మించారని గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు సత్యయుగ స్వర్గాన్ని, త్రేతయుగం లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరాలను విశ్వకర్మ నిర్మించాడని గ్రంథాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి జరుపు కుంటారు.ఆ రోజు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి. కుటుంబంతో సహా కలిసి పూజిస్తే ఇంకా మంచిది. పూజ చేసే చేతితో బియ్యం తీసుకుని విశ్వకర్మ దేవుడిని ధ్యానించండి అదే సమయంలో విశ్వకర్మ దేవుడికి తెల్లని పూలతో అలంకరించి ధూప ధీప పుష్పాలతో స్వామివారిని పూజించండం వల్ల సకల సంపదలు చేకూరుతాయని అలాగే మీ వద్ద కలిగి ఉన్న పనిముట్లు, యంత్రాలను ఇతర సాధనాలను విశ్వకర్మ భగవానుడి ముందుంచి పూజచేయాలి. చివరిగా విశ్వకర్మ భగవానుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు,ఎంజెఫ్ లయన్ గంటా రమేష్ బాబు (రీజియన్ చైర్మన్)ఎంజీఎఫ్ లయన్ నాదెండ్ల ముత్యాలరావు, (డిసి మైక్రో క్యాబినెట్ నెంబర్)ప్రోగ్రాం చైర్ పర్సన్ కందిమల్ల నరసింహారావు,లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్
సెక్రెటరీ ఏవి రావు, ట్రెజరర్ వెంకట తాతారావు,లయన్ అసిరి నాయుడు దంపతులు,ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ,లయన్ గాజుల రమేష్ దంపతులు,బేతంచర్ల వెంకటేశ్వరరావు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భిక్షపతి
బీజేపీ మండల అధ్యక్షులు లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.