**ఘనంగా శ్రీ చౌడేశ్వరీ మాత అఖండ జ్యోతిమహోత్సవం**
యాలాల్ అక్టోబర్ 10 ( జనం సాక్షి ):
యాలాల్ గ్రామ గోవిందరావు పెట్ లో శ్రీ చౌడేశ్వరి మాత మందిరంలో శ్రీ చౌడేశ్వరి తోగుట వీర్ క్షత్రియ సేవ సంఘం కమిటీ మరియు దేవస్థాన కమిటీ అధ్యక్షులు సంకారం లాలు ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఘనంగా అఖండ జ్యోతి మహోత్సవం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా సంకారం లాలు ఇంటి నుండి తోగుట వీర క్షత్రియులు అమ్మవారి దండకాలు, కీర్తనలు, భజనలు, పాటలు పాడుతూ అమ్మవారి అఖండ జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి అఖండ జ్యోతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో యాలాల్ గ్రామ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ దంపతులు పాల్గొని అమ్మవారి హారతి మరియు అఖండ జ్యోతులను పాలతో ఆర్పే కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు తోగుట క్షత్రియ సమాజం వారు సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ దంపతులను సన్మానించారు, ఈ సందర్భంగా మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ MLC మహేందర్ రెడ్డి గారు మరియు జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారి సహాయంతో కమ్యూనిటీ హల్ నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగింది.
వారితోపాటు ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్, నాయకులు నాగారం పాండు గౌడ్, కమ్మరి శేఖర్, పొస లాలు, చాకలి బాలరాజ్, చిట్లపల్లి లాలప్ప, న్యాదీర్గ హనుమంతు మరియు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ReplyForward
|