ఘన విజయం సాధించిన భారత్

india-vs-england-test-seriesఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 246  పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అచ్చొచ్చిన విశాఖలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తద్వారా భారత్ నిర్ధేశించిన 405 పరుగులను చేధించే క్రమంలో ఇంగ్లండ్ 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 167, 81 పరుగులు చేసిన భారత కెప్టెన్ కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడో టెస్టు 26 నుంచి మొహాలీలో ప్రారంభం కానుంది.