ఘోర పరాజయానికి నిలకడలేమే కారణం : జయవర్దనే
బుధవారం, ఆగస్టు 8: స్వదేశంలో జరిగిన ఐదువన్డేల సిరీస్‌తో పాటు ఏకైక ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్‌చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై శ్రీలంక కెప్టెన్ మహెళ జయవర్దనే స్పందించారు. భారత్‌తో జరిగినసిరీస్‌లో తమఆటగాళ్ల నిలకడలేని ఆటతీరే కొంపముంచిందని శ్రీలంకకెప్టెన్ మహెళ జయవర్దనే స్పంష్టం చేశారు.ఆటలో తమపట్టునుకొల్పోయాం.మైదానంలో ప్రత్యర్థిగేమ్‌కు తలోగ్గిపోవడం వల్లే పరా జయలను చవిచూడాల్సి వచ్చిందన్నారు. మంగళవారం జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో కూడా చివరి ఆరు ఓవర్లలో తాము పట్టు సాదించామని అయితే వికెట్లు త్వరత్వరగా పడిపోవడం వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా ప్రత్యర్థిఇన్నింగ్స్‌లో కీలకసమయాల్లో వికెట్లుతీయడంలో విఫలమయ్యయ న్నారు. చివరకు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ తమకు అందుబాటులో ఉన్నప్పటికి వికెట్లు కాపాడుకోవడంలో వి ఫలమయ్యమని జయవర్దనే చెప్పుకొచ్చారు.ఈదశలో తమచేతిలో వికెట్లు లేకపోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.