చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
నల్లబెల్లి సెప్టెంబర్ 30 ( జనం సాక్షి):
చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని తహసిల్దార్ దూలం మంజుల అన్నారు. శుక్రవారం మండలంలోని ముచ్చింపుల గ్రామంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ బొట్ల సువర్ణ ఎల్ల స్వామి, స్థానిక ఎస్సై నార్లపూరం రాజారాం, ఏ పి ఓ వెంకట్ నారాయణ, ఏ ఈ ఓ సాధన, అంగన్ వాడి టీచర్ పద్మ, అనగారిన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు పరికి కోర్నెల్, తెలంగాణ విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్, సామాజికవేత్త తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల సాంబారావు పాల్గొన్నారు.