చత్తీస్‌గడ్‌ పెట్టుబడులు – అభివృద్ధి బూటకం

అభివృద్ధి పేరు మీద జరుగుతున్న ఒప్పందాలు బడా కార్పొరేట్‌ బహుళజాతి సంస్థల ప్రయోజ నాలకేననీ, వీటి వల్ల సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదనీ అంటున్నారు విశ్వం
‘రండి, చత్తీస్‌గడ్‌పై విశ్వాసముంచండి. మొత్తం దేశాన్నే బంగారు భవిష్యత్తు వైపుకు తీసుకువెళ్లే బలం చత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి ఉంది. నిరాశ వాతా వరణంఓ ఉన్న మీకు చత్తీస్‌గడ్‌ రాష్ట్రం ఎలుగు రేకలా పనిచేస్తుంది. ఇకకడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతర సాధనాలు పారిశ్రామిక అభివృద్దికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గొప్ప అవకాశాలున్నాయి. చత్తీస్‌ఘడ్‌లో కరెంటు కొత మాటే లేదు. ఇతర రాష్ట్రాలలో ఎనిమిది నుండి పది గంటల వరకు కరెంటు కోత కొనసాగుతు న్నది. పరిశ్రమలపై, ఇతర రంగాలపై యాభై సం వత్సరాల వరకు మీకు ఉత్తేజం నిలపివ ఉంచేలా మా నియమాలు ఉన్నాయి. చత్తీస్‌గడ్‌లో పరిశ్ర మల అభివృద్దికై పారదశ్రకంగా, భాధ్యఆయుత మైన ప్రభుత్వంగా మీకు ఉత్తమ సేవలనను అం దించడానికి మేము సర్వవేళలా సిద్దమై ఉన్నాం. పర్మిట్‌ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం. మా ప్రభుత్వ కార్యదర్శి నిరంతరం మానిటరింగ్‌ చేస్తాడు. నేను కూడా మీకు ఎల్లప్పుడు అందు బాటులో ఉంటాను. ఇటువంటి వాతావరణం మీకు దేశంలో మరెక్కడా కనిపించదు. చత్తీస్‌గడ్‌ వెనుకబడ్డది అనేవారు. ఇప్పుడది గెంతు వేసి దేశంలో అగ్రశ్రేణిలో ఉన్న రాష్ట్రాల సరసన చేరింది. చత్తీస్‌గడ్‌ను దర్శించండి. ఇక్కడి అను కూలఅంశాలను తెలుసుకోండి. చత్తీస్‌గడ్‌లో ఇదే మీకు మా స్వగతం! అంటూ 2012, నవంబర్‌ 2,3 తేదీల్లో .జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ సందర్భంగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస ్థలకు తన హృదయపూర్వక స్వాగతం పలికాడు ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, రెండు రోజులు జరిగిన ఈ మీట్‌కై ప్రభుత్వం 50 కోట్ట రూపా యలు ఖర్చు పెట్టింది.
ఈ గ్లోబల్‌ మీట్‌కి వేదాంత గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అగ్రవాల్‌, ఎస్సార్‌ నుండి ప్రశాంత్‌ రుయి మా, అదాని గ్రూప్‌ నుండి రాజేశ్‌ అదాని, గోద్రేజ్‌ చైర్మన్‌ ఆది గోద్రేజ్‌, దైనిక్‌ భాస్కర్‌ పత్రిక సమూ హం నుండి రమేశ్‌ చంద్ర అగ్రవాల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, పార్టమెంట్‌ సభ్యుడు నవీన్‌ జిందాల్‌, అశోక్‌ ఇందూజా, లాఫర్జ్‌, కల్యాణీ స్టీల్‌, రుచిసోయా, ఆటోరంగం లోని లీలాండ్‌,ఎమ్‌టెక్‌లు, ఇంకా అమెరికా కౌన్సి ల్‌ జనరల్‌ పీటర్‌హౌస్‌తో పాటు ఐస్‌లాండ్‌, కువైట్‌, కోస్టారికా, క్యూబా మొదలైన 18 దేశా లకు చెందిన ప్రతినిదులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. మొదటిరోజే 55వేల కోట్ల రూపాయల విలువైన ఎంఒయులు జరిగాయి. మొత్తంగా లక్ష కోట్ల రు పాయల విలువ గల పెట్టుబడులను ఈ మీట్‌లో ఎంఒయులు జరిగినట్లు తెలిసింది.
నాయా రాయపూర్‌ అభివృద్ది మండలితోకలిసి పనిచేయడానికి ఆరు బడా కార్పొరేట్‌ సమూహాలు ముందుకు వచ్చి 23వేల 450 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి తమ సుముఖతను చూ పాయి. నయా రాయపూర్‌లో 80 హెక్టార్ల భూమి లో కాపిటల్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణం జరుతు న్నది. మొత్తం ఎనిమిది వేల హెక్టార్లలో నిర్మాణవుతున్న కొత్త రాజధాని ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు సహజ సిద్దమైన జలాశయాలు, చెరువుల నిర్మాణంతోపాటు గోల్ఫ్‌కోర్స్‌, అత్యాధునికమైన హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, కన్వెషన్‌ సెంటర్‌, దేశంలోని ఉన్నత శిక్షణ కేంద్రాలయిన ఐఐఎం, ఎఐఐఎంఎస్‌, ఎన్‌ఐటి, నేషనల్‌ లా యూనివర్సిటీలాంటివి ఉన్నాయి. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, స్టోర్ట్స్‌ సిటి, కాలనీలలో స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్నాషి యంలు, ఇండోర్‌గేమ్స్‌, బిలియార్డ్స్‌, బ్యాడ్‌మిం టన్‌ కోర్టులు లాంటివి కూడా ఉన్నాయి. వంద ఎకరాల స్థలంలో 136 కోట్ల రూపాయల ఖర్చు తో ట్రేడ్‌ సెంటర్‌ని నిర్మించి ఏటా పరిశ్రమల వ్యాపార మేళాలు నిర్వహిస్తారు. ఎంబియాన్స్‌ మాల్‌ అనే సంస్థ 10,700 కోట్ల రూపాయల ఖర్చుతో షాపింగ్‌మాల్‌, కాలనీలు, హోటల్‌ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. ఆమ్రపాలి అనే సంస్థ నయా రాయపూర్‌లో గోల్ఫ్‌కోర్స్‌, స్పోర్ట్స్‌ సిటి, హౌసింగ్‌ ప్రాజెక్టులకోసం తొమ్మిది వేల కోట్లు, సారడా ఎనర్జీ అర్బన్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌లో 1500కోట్ల రూపాయల డెనియర్‌ గ్రూప్‌ హాస్పిటల్స్‌, ఎడ్యుకేషనల్‌ సెక్టర్‌లో 1100 కోట్ల రూపాయలు. ఆగ్రవాల్‌ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ లాజిస్టిక్‌ హబ్‌ కోసం 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పం దాలు చేసుకున్నాయి. మొత్తంగా నాయా రాయ పూర్‌ కేంద్రంగా నగరాభివృద్దికి రియల్‌ ఎస్టేట్‌ లపై పెట్టుబడుల కేంద్రీకరణ జరిగింది.
రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పెద్ద ఎత్తున రాయితీలను కల్పించింది. టౌన్‌షిప్‌కై 54 ఎకరాలుగా ఉన్న భూపరిమితిని ఎట్టకేలకు ప్రభు త్వం రద్దు చేసింది. ఇప్పుడు ఏ బిల్డర్‌ అయినా పెద్ద పెద్ద ఏరియాలలో కాలనీలను నిర్మించవచ్చు. గతంలో దీనికి విరుద్దంగా 54 ఎకరాల సీలింగ్‌ ఉండేది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వ్యవసాయ భూములు డైవర్షన్‌ కూడా పెద్ద అడ్డంకిగా ఉం డేది. రమణ్‌సింగ్‌ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త చట్టాన్ని తయారు చేసింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములు కొని గృహనిర్మాణ ప్రాజెక్టులను తయారు చేయవచ్చు. 200,250 ఎకరాలలో కూడా పెద్ద పెద్ద టౌన్‌షిప్‌లన నిర్మించవచ్చు. ఈ కొత్త చట్టం తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఏ అడ్డంకులు లేకుండా పోయాయి. ఈ చట్టం మార్పుతో రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారం త్వరితగతిన అభివృద్ది చెం దేలా చేసిందటూ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డీలర్‌ అయిన ఆనంద్‌ సింఘానియా సంతృప్తిని వ్యక్తం చేసాడంటే, రమణ్‌సింగ్‌ ప్రభుత్వం ఎవరి ప్రయో జనాలను కాపాడుతుంది అనేది చెప్పకనే అర్థవ అవుతుంది.
ఈ గ్లోబల్‌ మీట్‌లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విష యానికి ప్రాముఖ్యతనివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పింది. ఈ మీట్‌లో లక్ష కోట్ల రూపా యల విలువైన ఎంఒముల జరిగినా దాంట్లో 20,700 కోట్ల పెట్టుబడులు హౌసింగ్‌ నిర్మాణా లకే వచ్చాయి. ఎల్‌పిజి గ్యాస్‌ పైపులైన్‌ నిర్మా ణానికి మరో 2500 కోట్ల రూపాయలు, సారడా ఎనర్జీ లిమిటెడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కై 1500 కోట్ల రూపాయలు. అలా మొత్తంగా 24,700 కోట్లు నిర్మాణ సంబంధిత పనులకు సంబంధించినవే. ఈ పెట్టుబడులేవీ నిరుద్యోగ యువతకు పర్మి నెంట్‌ ఉద్యోగాలు కల్పించలేవు. మహా అయితే మట్టి గిట్టి మోసే కూలీపనులు కొంత దొరకవచ్చు తాపీ మేస్త్రీ లాంటి అసంఘటిత కార్మికులకు కొద్దిరోజులు పనులు దొరికే మాట వాస్తవమే అ యినా బంగ్లాలు, రోడ్లు, బ్రిడ్జిలు, మరికి కాల్వలు, పైపులైన్లు, కాలనీల లాంటి నిర్మాణాలు పూర్తికా గానే పనులన్నీ అయిపోతాయి. పెట్టుబడులు రా బట్టడం ద్వారా జరిగిన అభివృద్ది ఇదే అంటే ఎవరు నమ్ముతారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం లాభ సాటి కావడంతో ప్రభుత్వం కూడా జాయిం ట్‌ వెంచర్‌ మొదలుపెట్టింది. ప్రస్తుత పెట్టుబడు లలో 31,650 కోట్ల రూపాయలు రియల్‌ ఎస్టేట్‌ తో సహా నయా రాయపూర్‌ నగరాభివృద్దిపై కేంద్రీ కరించాయనేది స్పష్టం. ఢిల్లీలోని ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌ అనే కంపెనీ రాయపూర్‌నుండి నయా రాయపూర్‌కి 4500 కోట్ల రూపాయల పెట్టుబడితో మోనో రైలును నడ ిపేందుకు సిద్దపడింది. అయితే ముప్పై కిలో మీటర్ల పొడవైన రైలు మార్గాన్ని మాత్రం చతీ ్తస్‌గడ్‌ ప్రభుత్వం రెండేళ్లలో నిర్మించి ఇవ్వాలి. రమణ్‌సింగ్‌ ప్రభుత్వం అధికారులకు ఉచితంగా భూమి, నీరు, విద్యుత్‌ లభించేలా రాయితీలను కల్పిస్తూ నిర్ణయాలు చేసింది. పరిశ్రమల కసమని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వాలు ప్రజాధనంతో తయారు చేసి పెడితే లాభాలను మాత్రం కొర్పొ రేట్‌ సంస్థలు దున్నుకుపోతున్నాయి. ఎన్‌టిపిసి రాయగఢ్‌లో మెడికల్‌ కాలేజికి వంద కోట్ల రూపా యలు ఖర్చు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి. డెనియర్‌ గ్రూప్‌ కూడా హాస్పిటల్‌,ఎడ్యుకేషన్‌ సెక్టర్‌లో 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్దపడింది. ఎడ్యుకేషనల్‌ సెక్టార్‌లో కార్పొరేట్‌ సంస్థల ప్రవేశంతో విద్య సామాన్యు లకు అందుబాటులో లేకుండా పోయింది. ఐఐటిలో ఏడాదికి ఫీజు 90 వేల రూపాయలు. ఉన్నత విద్యను అభ్యసించేందుకుఖర్చులు విపరీ తంగా పెరిగిపోవడంతో రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధుల సంఖ్య కేవలం 9.3 శాతమే ఉంది. కొత్త రాజధాని ఏర్పాటుతో నయా రాయపూర్‌, రాయపూర్‌లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాఆపరం ఊపందుకుంది. నయా రాయపూర్‌లోని ఎనిమిది వేల హెక్టార్లలో నిర్మించే గృహ సముదాయాలలో ఐదు లక్షల ఇళ్లను నిర్మించే యోజన ఉంది. ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. బిల్డర్స్‌ పుట్టగొడుగుల్లా వెలిసారు. పెద్ద ఎత్తున సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భూ కబ్జాలు పెరిగాయి. భూ మాఫియా ముఠాలు కూడా తయారైనాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బిల్డర్స్‌ పాలిట బంగారు కాసుల పంట తయారయింది. మరో పక్క భూములు కోల్పోయిన రైతాంగం తీవ్ర ఆవేధనకు గురై అనేక కష్టాల పాలవుతున్నారు. కాపిటల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంకై భూములను ఖాళీ చేసిన రాఖి గ్రామస్తులకు భూమి ధరతో పాటు, పది సంవత్సరాల పాటు ఏటా పదిహేను వేల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, రమణ్‌సింగ్‌ ప్రకటించగా నిర్వాసితులు ఆ ఆర్థిక ప్యాకేజీని తిరస్కరిస్తూ హర్యానా ప్రభుత్వం లాగా భూమి ధరతోపాటు 33సంవత్సరాల పాటు రూ. 21, 000లుగా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కొత్త రాజధాని కోసం సేకరించిన ఎనిమిది వేల హేక్టార్ల భూముల కోసం నిర్వాసితులకు చెల్లించే మొత్తం రెండు వేల కోట్ల రూపాయల కోసం నిర్వాసితులకు చెల్లించే మొత్తం రెండు వేల కోట్ల రూపాయలకు మించడం లేదు. కానీ ఆ భూముల మీదనే 20-30లక్షల కోట్ల రూపాయల విలువగల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగుతున్నది. ఇది రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పెట్టుబడుల భాగోతం. చత్తీస్‌గడ్‌ రాష్ట్రం ఆవతరణతో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సెక్షన్‌ బలపడుతున్నది. అపారమైన ఖనిజ సంపదలు గల చత్తీస్‌గడ్‌లో ప్రజలను కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వానికి ఈ బ్యూరోక్ట్రాన్స అవసరం ఎంతో ఉంది. విఐపీ సీటి పేరుతో నిర్మాణం మొదలుపెట్టిన కాలనీలో ఒక్కో ఇండిపెండెంట్‌ బంగ్లా ఖరీదు 70లక్షల రూపాయలు, ఇంకా ఈ కాలనీలో స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్మాషియం, ఇండోర్‌ గేమ్స్‌, బ్యాడ్మింటన& కోర్టు వైగారాలు ఉన్నాయి. ఇంతటి విలాసవంతమైన నయా రాయపూర్‌లో ఎంఐజి గ్రూపు ఇళ్లను మాత్రం 21 శాతానికే పరిమితం చేసింది ప్రభుత్వం
రియల్‌ ఎస్టేట్‌ తరువాత పర్యాటక రంగంలో పెట్టుబడులు ప్రవేశించాయి. ఇందులో రూ. 1572కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయులు జరిగాయి. కార్పొరేట్‌ కంపెనీలు ఎక్కువగా పైన్‌స్టార్‌ హోటల్స్‌కి, ఎయిర్‌ కనెక్టివిటీకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ముంబాయిలోని ఇన్నోవేటివ్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ ఫన్‌సిటీ పార్కు కోసం రూ. 400కోట్లు, మరో కంపెనీ బిలయ్‌లో హర్బల్‌ ప్లాంట్‌కి రూ. 200కోట్లు, టోటల్‌ ఇంఫరెమెటివ్‌ హోటల్‌కై రూ. 200 కోట్లు, జిందాల్‌ యూనివర్సల్‌ ఇండియా రాయగఢ్‌లో హోటల్‌ కోసం రూ. 450 కోట్లు, యూనిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైప్‌స్టార్‌ హోటల్‌కై రూ. 200కోట్లు, గౌతంరాజ్‌ డవలప్‌మెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కై వంద కోట్ల రూపాయలు, ఇంకా రూట్స్‌ కార్పొరేషన్‌ వందకోట్ల రూపాయలు, ఇంకా రూట్స్‌ కార్పొరేషన్‌ వంద కోట్ల రూపాయలు , సౌభాగ్య తిలక్‌ ఇరవై కోట్ల రూపాయలు, కాస్మో స్పాంజ్‌ వవర్‌ రూ. 75కోట్లు హోటళ్ళఖై ఖర్చు పెడుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ తరవాత పర్యాటక రంగంలో హోటళ్ల వ్యాపారం లాభసాటిగా తయారయింది. విలాసవంతమైన ఈ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో ఒకరోజు విడిది లక్షల్లో మాట. సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో లేనటువంటిది. రోజుకి ఇరవై రూపాయలతో బతుకులెల్లదీసే సగం జనాభా కలిగిన ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో స్వర్గాన్ని మరిపించే ఈ ఫైవ్‌స్టార్‌ హోటళ్ల సంస్కృతి వాస్తవానికి ఇది సామ్రాజ్యవాద సంస్కృతే. వీటిని పెంచి పోషించడం బడా కార్పొరేట్‌ సంస్థల ముందు మోకరిల్లే రమణ్‌సింగ్‌కే చెల్లుబాటవుతుంది. పర్యాటక రంగంలో అభివృద్ధి అంటే వ్యభిచారం, తాగుడ, డ్రగ్స్‌ని పెంచి పోషించడమే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 173 పెద్ద మధ్య తరహా పరిశ్రమలు నెలక్పొబడ్డాయి. వాటి పెట్టుబడుల విలువ రూ. 75, 241కోట్లు, అలాగే 44, 623చిన్న తరహా పరిశ్రమలు కూడా నెలకొల్పబడ్డాయి. వాటి మొత్తం పెట్టుబడిరూ. 1602కోట్లు, గుప్పెడు పరిశ్రమల్లో పెట్టుబడి కేంద్రీకరణ ఏమి తెలియజేస్తున్నది. టాటా స్టీల్‌ బస్తర్‌లో పదివేల కోట్ల రూపాయల ఖర్చతో ఏటా యాభైలక్షల టన్నుల ఇనుము ఉత్పత్తిగా లోహండిగూడాలో ఆరువేల కోట్ల రూపాయల ఖుర్చుతో ఎన్‌ఎండిసీ ఏటా 32లక్షల టన్నుల లక్ష్యంతో నగర్‌నార్‌లో స్టీల్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు అనుమతులనిచ్చింది. ప్రభుత్వం. అయితే ఈ రెండు బడా కంపెనీలు భూసేకరణలో అవలంభించిన విధానాల వల్ల మూలకు పడ్డాయి. ప్రజల తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. రమణ్‌సింగ్‌ ప్రభుత్వం బడా కంపెనీల పక్షాన నిలబడి వేలాదిగా పోలీసు బలగాలను దింపి ప్రజలపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగిస్తున్నది. ప్రజలు కూడా వెరవక తమ ప్రతిఘటనను కొసాగిస్తున్నారు. ఇంద్రావతి నదిపై బోద్‌ఘాట్‌ వద్ద ప్రభుత్వం తలపెట్టిన 500మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇంతే. సర్‌గుజా, బస్తర్‌లోని లోహండిగూ, బోద్‌ఘాట్‌, రావ్‌గాట్‌, నగర్‌నార్‌లలో పరిశ్రమల (ప్రాజెక్టులు) స్థాపన అంటే అక్కడి ఆదివాసుల విస్తాపనగా తయారయింది. పరిస్థితి. మల్టీనేషనల్‌ కంపెనీలకు ఊడిగం చేసే మరణ్‌సింగ్‌కు నిర్వాసితులవుతున్న ఆదివాసులు కడగండ్లు ఎందుకు కనిపిస్తాయి.
టాటాలాంటి స్టీల్‌ ఫ్యాక్టరీలు స్థాపించడమే అభివృద్ధికి సూచిక అనుకుంటే అది ఒట్టి బూటకం మాత్రమే. జంషేడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ ఫ్యాక్టరీ నెలకొల్పి వంద సంవత్సరాలు అయినా జార్ఖండ్‌ రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఎలా ఉండగలిగింది. మల్టీ నేషనల్‌ కంపెనీలు, బడా కార్పొరేట్‌ సంస్థలు ప్రజల అభివృద్ధిని కాంక్షించి పెట్టుబడులను ఎప్పుడు పెట్టవు. వాటికి లాభాలు ముఖ్యం. లాభాలు తప్పించి వాటికి మరే ధ్యాస ఉండదు. అభివృద్ధి మాటా ఎలా ఉన్నప్పటికీ, ఈ కార్పొరేట్‌ కంపెనీలు మాత్రం మరో పెదళ్ల కాలానికి పదో లేక ఇరవయో వేల కోట్ల రూపాయలను వెనకేసుకోవడం మాత్రం ఖాయం. ఇందుకు వేదాంత కంపెనీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. దేశంలో సరళీకరణ విధానాలు మొదలైన నాడు అనిల్‌ అగ్రవాల్‌ పేరును ఎవరు ఎరుగరు. ఇదే ఇరవై ఏళ్లలో ఆయన సంపద 1025రెట్లు పెరిగింది. అదే ఇరవై ఏళ్లలో టాటా సంపద 38రెట్లు పెరిగింది. ఇలా మహీంద్ర 270రెట్లు, ముకేష్‌ అంబానీ 101రెట్లు తమ సంపదలను పెంచుకున్నారు. ముకేష్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక్క సంవత్సరం లోనే 6601 కోట్ల రూపాయల పెట్టుబడిని పెంచుకుంది. పెట్టుబడులను ఆహ్వానించడమంటే కర్కశంగా కార్పొరేట& సంస్థలు, మల్టీనేషనల్‌ కంపెనీలు తమ సంపాదనలు మరింత పెంచుకోవడానికి లైసెన్సును మంజూరు చేయడం లాంటిదే. ఆదివాసుల రైతుల భూములు నుంచి ఖనిజాన్ని తవ్వి అమ్ముకోకుండా, కార్మికుల శ్రమను దోచుకోకుండా ఏ కార్పొరేట్‌ సంస్థ తన సంపదను పెంచుకోలేదు. తమ లాభాలను దన్నుకోవడానికి బడా కంపెనీలు ప్రజలపై ఎలాంటి దయా దాక్షిణ్యాలు చూయించలేవు. అందుకు గాను, రమణ్‌సింగ్‌ తన ప్రభుత్వ సాయుధ బలగాలతో ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉండనే ఉన్నాడు. బడా కంపెనీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలోని ఉన్నత శ్రేణి అధికారులు త్రయం ఒక్కటై ప్రజల మూల్గులను పీల్చివేస్తున్నాయి.
రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ గ్లోబల్‌ ఇన్వేస్టర్‌ మీట్‌ అంటున్నాడు. రమణ్‌సింగ్‌. కానీ వాస్తవానికి రాష్ట్రాన్ని కార్పొరేట్‌ కంపెనీల ముందు అమ్మకానికి పెట్టినట్టుంది. వ్యవహారమంతా అందుకే ఓ కాంగ్రెస్‌ నేత బీజేపీ ఇప్పటికే రాష్ట్రాన్ని తె అమ్మింది. ఇంకా ఏమి మిలిగిందని ఈ మీట్‌లో అమ్మడానికి అంటూ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్‌ తానేమి తక్కువయ్యినట్టు.
అసలు రమణ్‌సింగ్‌ ప్రభుత్వానికి అభివృద్ధా, పరిశ్రమలా, పెట్టుబడులా ఏమి కావాలి? పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృౠద్ధిని సాధించాలనే చిత్తశుద్ధి గనక ఉంటే దేశంలోని వివిధ పరిశ్రమలకు సప్లయి చేస్తున్న ముడిసరుకుల ఆధారిత పరిశ్రమలకు ఎన్నింటినో నెలక్పొలవచ్చు. రాష్ట్రంలో స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు 105 వరకు ఉన్నాయి. వీటికి ముడిసరుకుగా ఉపయోగపడే ఐరన్‌ ఓర్‌ ధరను ఎన్‌ఎండీసీ మొండిగా పెంచడంతో ఆ ధరను చెల్లించలేక ఇరవైకి పైగా స్పాంజ్‌ ఉన్నాయి. ఉత్పత్తి 30శాతానికి పడిపోయిది. ఎన్‌ఎండీసీ ఐరన్‌ ఓర్‌ను చిన్న, మధ్య తరహా పరిశ్రమల కంటే జపాన్‌ లాంటి విదేశాలకే ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఐరన్‌ ఓర్‌ ధరను 1500రూపాయల వరకు తగ్గించాలని చత్తీస్‌గడ్‌ స్పాంజ్‌ ఐరన్‌ ధరను 1500రూపాయల వరకు తగ్గించాలని చత్తీస్‌గడ్‌ స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమల అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఎన్‌ఎండీసీ మాత్రం కేవలం 300రూపాయల మాత్రమే తగ్గించింది. ఈ ధరకు ఐరన్‌ ఓర్‌ను కొనలేక రాష్ట్రంలోని స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమల ఆస్తిత్వానికే ముప్పు ఏర్పడింది.