చిట్‌ఫండ్‌ బాధితులకు దీదీ బాసట

రూ.500 కోట్ల సహాయం
నిందితుడి అరెస్టుకు ఆదేశాలు
కోల్‌కత్తా, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
శరదా గ్రూప్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేయడంతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు బాసటగా నిలవాలని పశ్చిమ బెంగాళ్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల సహాయం అందించనున్నట్లు బుధవారం ప్రకటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, శరదా రియాల్టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ అరెస్టుకు ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. సేన్‌కు చెందిన శరదా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లోని శరదా చిట్‌ఫండ్స్‌ కంపెనీ రూ.5000 కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఆ కంపెనీ దివాళ తీయడంతో ఇన్వెష్టర్లు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో దీదీ దిగివచ్చారు. ప్రభుత్వం, పార్టీపై వెళ్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో బాధితులకు సాయం అందించేందుకు అంగీకరించారు.