చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

5
యువత స్వయం ఉపాధికి సిద్ధం కండి

ముద్రా బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి):

ప్రస్తుతం దేశంలో స్వయం ఉపాధి అవసరాలు పెరుగుతున్నాయని, ముద్రా బ్యాంకు చిన్న తరహాపరిశ్రమలకు ఆర్థికసాయం చేయనుందని ప్రధాని మోడీ వెల్లడించారు. దేశంలోని చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం పెరిగిందన్నారు. వీరి అవసరాలను ముద్రా బ్యాంక్‌ తీర్చాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బుధవారం దిల్లీలో  ముద్రా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రదాని మాట్లాడుతూ.. రూ.20వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకును ప్రారంభించినట్లు చెప్పారు. ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల యూనిట్లకు లబ్ది కలుగుతుందన్నారు.  తమ ప్రభుత్వం దేశంలో సవిూకృత అభివృద్ధిని కాంక్షిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. రూ. 20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంక్‌ను ప్రారంభించామని తెలిపారు. నిరుద్యోగులు, యువకులు, మహిళలకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. గ్యాస్‌ సబ్సిడీ నగదు 13 కోట్ల మంది ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు. ప్రకృతి విపత్తులతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ఎలా సాయం చేయవచ్చనే అంశం పరిశీలిస్తున్నామని చెప్పారు. రుణాల రీషెడ్యూల్‌, పంటల బీమా అంశంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.  5.77 కోట్లమంది ఉన్న చిన్న వ్యాపారులకు ముద్రా బ్యాంకు నుంచి ప్రయోజనం ఉందన్నారు. పెద్ద పరిశ్రమలు 1.25 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 12 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయని మోదీ తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కాగా ముద్ర బ్యాంకు చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించనుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 5.77 కోట్ల చిన్నచిన్న వ్యాపార యూనిట్లు ఉన్నాయి. అలాగే ఈ బ్యాంకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు నియంత్రణ బ్యాంకుగా వ్యవహరించనుంది. ముద్ర బ్యాంకును రూ.20వేల కోట్ల కార్పస్‌ ఫండ్తో, రూ.3వేల కోట్ల క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్తో ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్‌ జైట్లీ గత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు.