చిరంజీవిపై సీబీఐ విచారణకు ఓయూ జేఏసీ డిమాండ్‌

దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) :
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై సీబీఐ విచారణ జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రపంచ పర్యాటక సదస్సు పేరుతో కేంద్ర మంత్రి చిరంజీవి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓయూ జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. జేఏసీ సభ్యులు కోఠీలోని సీబీఐ కార్యాలయానికి వచ్చి జేడీకి వినతిపత్రం ఇచ్చారు. ప్రముఖ కార్పొరేట్‌ ¬ట్లళ్లయిన పార్క్‌, తాజ్‌ ఫలక్‌నుమాల్లో జరిగిన యూఎన్‌డబ్ల్యూటీవో సదస్సులో భారీగా ప్రజాధనం వృథా అయిందని ఓయూ జేఏసీ నాయకులు ఆరోపించారు. కేవలం మూడు రోజుల సదస్సు కోసం రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ప్రైవేటు ¬టళ్లకు పర్యాటక శాఖ దారాదత్తం చేసిందని, ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలిసిన ఓయే జేఏసీ నేతలు కోరారు. ఇదిలావుంటే నిధుల దుర్వినియోగంపై జేఏసీ నాయకులు శుక్రవారం చిరంజీవి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.