చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి పండుగ *తూప్రాన్ గీత స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 22:: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగ జరుపుకుంటామని గీతా స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు పేర్కొన్నారు తూప్రాన్ గీత హై స్కూల్లో దీపావళి సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు గీతా హై స్కూల్ లో దీపావళి వేడుకలను ముందస్తుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వేదికపై విద్యార్థినులు దివ్వెలు చేతబూని నృత్యాలు చేశారు. సాంప్రదాయ దుస్తులను ధరించిన విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ” నరకాసుర వధ” నృత్య రూపకం ఆకట్టుకుంది. సత్యభామ నరకాసురున్ని వధించే సన్నివేశం విద్యార్థుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దీపావళి పండుగ శరదృతువులో రావడం వల్ల మనోనిశ్చలతకు,సుఖశాంతులకు అనువైన కాలమని పాఠశాల చైర్పర్సన్ ఉష రామాంజనేయులు అన్నారు. అలాగే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని అన్నారు. పాఠశాల డైరెక్టర్ మరియు మున్సిపల్ చైర్మన్ .రాఘవేందర్ గౌడ్, డైరెక్టర్ మున్సిపల్ కౌన్సిలర్ నారాయణ గుప్త, ప్రిన్సిపాల్ వెంకటకృష్ణారావు, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రేంరాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు