చూచిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌

కమలాపూర్‌: పదోతరగతి పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సాంఘీక శాస్త్రం మొదటిపేపర్‌ పరీక్షలో చూసిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కమలాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రంలో డిబార్‌ చేశారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజలేటర్‌ను తప్పించారు.