చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి
ఖమ్మం : మండలంలోని అరెంపుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరాగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఒప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది, వీరంతా వరంగల్ పెళ్లికి హాజరై వస్తుండగా ఈప్రమాదం జరిగింది.