చెరువుల అభివృద్ది పూర్తి

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): నేలకొండపల్లిలోని బాలసముద్రం చెరువులో అభివృద్ధిలో భాగంగా బతుకమ్మ ఘాట్‌ను కూడానిర్మిచండం జరుగుతుందని అధికారులు అన్నారు. కట్టపై సిమెంటు నిర్మాణం, చెరువులో బోటింగ్‌ ఏర్పాటు లాంటివి చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువులో తవ్విన మట్టిని రైతులు తమ భూముల్లో పోసుకుంటే ఎంతో లాభం ఉంటుందన్నారు. భూములకు బలం పెరిగి పంటల దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. చెరువులో మట్టిని పూడిక తీసే పనులు ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గం లో  మిషన్‌ కాకతీయ పథకంలో 40 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు సాగునీటి పారుదలశాఖ అధికారులు  తెలిపారు. మూడు విడతల్లో చెరువులను అభివృద్ధి చేయడం పూర్తయిందని మిగతా చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. . విడుదలచేసిన నిధులతో చెరువులో పూడిక తీయడం, అలుగు నిర్మానం, కాలువల నిర్మాణం, తూముల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి చెరువును అభివృద్ధి చేసే ముందు రెవెన్యూ అధికారులు చెరువు హద్దులను గుర్తిస్తే బాగుంటుందని, కొన్ని చోట్ల రెవెన్యూ సిబ్బంది లేక చెరువుల హద్దులను గుర్తించడం లేదన్నారు.