చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేసిన విఆర్ఏలు

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 08,( జనం సాక్షి) :
విఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు  సమస్యలు వెంటనే పరిష్కరించాలని విఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ తాల్లపెల్లి జయరాజు విఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలిషాల రాము అన్నారు. తహసీల్దా రు కార్యాలయం ముందు విఆర్ఏలు చేపట్టిన సమ్మె 15 వ రోజులకు చేరుకుంది.ఈ సందర్భంగా విఆర్ఏలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని కోరారు. విఆర్ఏలకు పేస్కెల్ జీఓనువెంటనే విడుదలచేయాలని, అర్వ త కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరములు నిండిన విఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు.  విఆర్ఏలకు ఇచ్చిన హామీలు పరిష్కరించాలని, లేనిఎడల హామీలు నెరవేర్చె వరకు సమ్మె కొనసా గుతుందని అన్నారు. ఈ సమ్మె కార్యక్రమంలో మండలఅధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్,ప్రధానకార్య దర్శి ఎలిశాల రాము,వీఆర్ఏల సంఘం కోశాధికా రి శివ,సభ్యులు రమ్య జ్యోతి, రాజేశ్వరి, సరోజ, యాదేశ్,వెంకట్రజం,అభి, రాజుకుమార్, సృజన్, పోతరాజు,అశోక్,మహేశ్వరి,బాషబోయిన రాజు, నీల రాజు, జి రాజు, వెంక టారాజం, నాగరాజు, పోషయ్య, యకయ్య  తదితరులు పాల్గొన్నారు.