చేజేతులా…
– బంతిని తన్ని అవుటైన పఠాన్ – మలుపు తిరిగిన మ్యాచ్ – పూణే అనూహ్య విజయం
రాంచీ : కోల్‌కతా నైట్ రైడర్స్, పూణె వారియర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తోలుత బ్యాటింగ్‌కు దిగిన పూణె వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తర్వాత 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. పూణె 7 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. పూణె బ్కాటింగ్‌లో ఉతప్ప, ఫించ్ శుభారంభాన్నందించారు. క్రీజ్‌లో నిలిచిన ఉతప్పను సేనానాయకే 41 పరుగుల వద్ద ఔట్ చేశాడు. 48 పరుగులు చేసిన ఫించ్ బాలాజీ బౌలింగ్‌లో ఔట్ అయి అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. తర్వాత పాండే, యువరాజ్ ఇద్దరు కలిసి 65 పరుగుల చక్కని భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. పాండీ 66 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కల్లిస్ బౌలింగ్‌లో రన్‌కు ప్రయత్నించగా బిస్లా రనౌట్ చేశాడు. యువరాజ్ ఆఖరి బంతికి షాట్‌కు ప్రయత్నించగా కల్లిస్ బౌలింగ్‌లో డియోశ్చాట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా 29 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఓడిపోయే స్థితికి చేరుకుంది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన పఠాన్, టెన్ డియోశ్చాట్ అద్బుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు 98 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డియోశ్చాట్ 42 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అప్పటిదాకా కోల్‌కతా విజయం ఖాయమనుకున్నారు కాని, యూసఫ్ పఠాన్ 72 పరుగుల వద్ద విచిత్రంగాఅవుటయ్యాడు. పర్నెల్ బౌలింగ్‌లో డిఫెన్స్ అడి రన్‌కు ప్రయత్నించి బంతిని తన్నుకుంటు ముందుకు తన్నుకుంటూ వెల్లాడు అంపర్ ధర్డ్ ఎంపైర్‌ను సంప్రదించగా ఔట్‌గా ప్రకటించాడు. ఈ ఘటనతో మ్యాచ్ పూర్తిగా పూణె వారియర్స్ చేతిలోకి వెళ్లింది. పూణె బాలింగ్‌లో పార్నెల్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, పాన్డె తలో వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో మెరిసిన పాండేకి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది.
పూణే వారియర్స్ బ్యాటింగ్ 170- 4 (20 ఓవర్లలో)
రాబిన్ ఉతప్ప (బి) శిననాయకి 25 ఏజే.ఫించ్ (బి)బాలాజీ48 ఎంకే పాండే(రనౌట్)బిస్లా,కలీస్66 యువరాజ్ సింగ్ (సి)టిన్ డియోస్‌చాటి(బి)కలీస్ 30 ఎల్‌జే వైట్ (నాటౌట్ )0 ఎక్స్‌ట్రాలు1
కోల్‌కతా బౌలింగ్
ఎల్ బాలాజీ 4-0-41-1 శిననాయయకీ 4-0-22-1 ఎస్‌పీ నరైన్ 4 -0-26-0 కలీస్ 4-0-26-0 ఆర్ బైటా 3-0-26-0 ఆర్‌ఎన్ టెన్ డియోస్టాచ్ 1-0-7-0
కోల్‌కతా బ్యాటింగ్ 163-(20 ఓవర్లలో)
గంభీర్ (సీ)యువరాజ్ సింగ్ (బీ)పాండే)12 బిస్లా (ఎల్‌బీ డబ్ల్యు)పార్‌నెల్ 1 కలీస్ (బీ)పార్నెల్ 1 యూసఫ్ పఠాన్ 72 ఆర్‌ఎన్ టెన్ డియోస్టాచ్ (రనౌట్ )ముర్తాజా ,ఉతప్ప 42 తివారీ (సీ)పాండే (బీ)కుమార్ 0 డాస్ (నాటౌట్)8 బైటా(రనౌట్)ఉతప్ప మాథ్యుస్ 10 సిననాయకీ(నాటౌట్)2 ఎక్స్‌ట్రాలు15
పూణే బౌలింగ్
కుమార్ 4-0-22-1 పార్నెల్ 4-0-34-2 పాండే2-0-17-1 మాథ్యుస్ 3-0-25-0 ముర్తాజా 4-0-34-0 యవరాజ్ సింగ్ 1-0-11-0 వైట్ 1-0-5-0 గోమిజ్ 1-0-5-0