చైతన్యం వెలిగించిన సకల జనుల సమ్మె

ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా క బళించే క్రమంలో జరిగిన నష్టంలో,ట్రేడ్‌ యూని యన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతాబ్ధపు  1970 దశకంలో దే శ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో, ముఖ్యంగా రైల్వే సమ్మె మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఆ కా లంలో ఉద్యోగులు, రవాణా, ఉపాధ్యాయులు పో స్టల్‌ ఉద్యోగులు సమ్మె చేస్తే సమాజం దాదాపు స్తంభించిపోయేది. ఆ క్రమం 1980 దశకం వర కు చాలా మారింది. కార్మిక సంఘాల నాయకత్వ రాజీ ధోరణి, అమ్ముడుపోయే ధోరణి పెరిగి కార్మి కవర్గ పాత్ర కుంచించుకుపోయింది. 80వ దశ కంలో దాదాపు సమ్మెలు జరగడం ఆగిపోయిం ది. దశకంలో ఊపందుకున్న ప్రపంచీకరణ వ ల్లా, సర్వీస్‌ రంగాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రై వేటీకరించడం వల్లా, పబ్లిక్‌ రంగ ఉద్యోగులు స మ్మె చేసినా అన్ని రంగాలలో సమాంతరంగా ప్రై వేట్‌ రంగం పెరగడం వల్లా-మధ్య తరగతికి, ప్ర త్యేకించి పాలకవర్గాలకు సమ్మె ఒక సమస్యే కా కుండాపోయింది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా సమ్మెల సంఖ్య గణనీయం గా తగ్గిపోయింది. దీనికి తోడు కార్మిక రంగ సం స్థల్లో పోటీ సంస్థలు, రాజకీయ పార్టీల అనుబం ధ సంస్థలు బలంగా ఉండడం వలన, రాజకీయా లు ఎలా దిగజారాయో అదే క్రమంలో ట్రేడ్‌ యూనిన్లు కూడా దిగజారుతూ, ఒక సంఘం స మ్మె పిలుపు ఇస్తే మరో సంఘం దానిని వ్యతిరే కించడంతో సమ్మె విఫలం కావడం దాదాపు సా ధారణమై పోయింది. ఈ నేపథ్యంలో సకల జను ల సమ్మె, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, సింగరేణి కార్మికులు తమ మాతృ సంస్థలతో సంబంధం లేకుండా సంఘటితంగా ఉద్యమాలు చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఒక కొ త్త విశ్వాసాన్ని కలిగించింది. సకల జనుల సమ్మె తెలంగాణలో ఉదృతంగా జరుగుతున్న కాలంలో నే వాల్‌వూస్టీట్‌కు వ్యతిరేకంగా 80దేశాలలో ని రుద్యోగులు, సాధారణ పేద ప్రజలు రాజ్య వ్యవ హార  పద్ధతిని, అక్రమ సంపదకు అవినీతి రాజ కీయాలకు మధ్య ఏర్పడిన అనైతిక సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రధానంగా లేవదీసిన ప్రశ్న. సామా జిక ఆర్థిక జీవితంలో రాజకీయాల పాత్ర ఏమిటీ ? ఈ ఉద్యమాలకు స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ప్రపంచవ్యాప్తంగా సంపద మీ ద తిష్ట వేసి కూర్చున్న వాళ్లు సామాజిక శ్రేయ స్సును గురించి ఆలోచించవలసిన సమయం ఆ సన్నమైందని వ్యాఖ్యానించాడు. ఈ తిరుగుబాటు అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పా కింది. ఆమెరికా అధ్యక్షుడు కూడా ఈ తిరుగుబా టుదారుల ఆవేధనను ఆర్థం చేసుకోవాలని సంప న్నులకు సలహా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా జ రుగుతున్న తిరుగుబాటులో ఒక గమనించదగ్గ అంశం, ఏ సాంకేతిక విజ్ఞానాల ద్వారా సంపన్ను లు ప్రపంచాన్ని నియంవూతిస్తున్నారో, ఆ సాంకే తిక మార్గాల ద్వారానే ప్రపంచవ్యాప్త తిరుగుబాట్ల మధ్య ఒక సంబంధం ఏర్పడింది. ఒకవైపు ఐఎల్‌ఓ పని అంటే ‘డీసెంట్‌ పని’ అవి, అది గౌ రవప్రదంగా ఉండాలని నిర్వచించినా ఆ మాట వినేవాళ్లే కరువయ్యారు. పని చేయడానికి చేతు లుండి, ఆలోచించే శక్తి ఉన్న మనుషులకు పని ఎందుకు దొరకదు ? అనేది చాలా మౌలికమైన ప్రశ్న.ఆహార సేకరణ దశలో ఏ మనిషికామనిషి తమ ఆహారాన్ని తామే సేకరించే పనిలో ఉన్నా రు. అందరికి ప్రకృతి వనరులు అందుబాటులో ఉన్నాయి, ఆ దశ నుంచి అత్యంత ఆధునిక దశ కు చేరుకున్నామని భ్రమించే వ్యవస్థలు మనిషి జీ వితాన్ని ఉన్నతీకరించే బదులు పనిలేని పని దొర కని మనుషులను చేశాయి. మనిషికి చేతినిండా పని కల్పించని ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అది అమానవీయ దోపిడీ వ్యవస్థే.

తెలంగాణ ప్రాంతంలో చారిత్రకంగా ప్రపం చ మార్పులకు ప్రతిస్పందించే ఒక గుణముంది. దేశమంతా స్వాతంత్య్రోద్యమం జరుగుతున్నప్పు డు, అర్థ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థకు వ్యతి రేకంగా చైనాలో జరుగుతున్న పోరాటంతో పోల్చ గల సాయుధ పోరాటం తెలంగాణ అనుభవంలో ఉంది. ఆ పోరాటం ఎంత అర్ధంతరంగా ముగిసి నా ఆ దారిలో అనుభవం తెలంగాణకు గొప్ప వా రసత్వాన్ని ఇచ్చింది. ఆ పోరాటాన్ని అణచివేసి, అదే వినాదాలను తీసుకొని కాంగ్రెస్‌ ప్రజల మద్ద తు కూడగట్టుకుంది. అప్పటికి, ఇప్పటికీ  కాంగ్రె స్‌ స్వభావంలో అలాగే ఉంది. అప్పుడు సోషలి జం పేరు చెప్పి,ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలలో గెలవాలని తప్పించి నిజాయితీ గా న్యాయమైన పరిష్కారమేమిటా అని ఆలోచిం చే స్థితిలో లేకపోవడం ఎంతో అప్రజాస్వామికం. ఇది మోసపు చరిత్ర కొనసాగింపు. అలాగే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన ప్పుడు ప్రపంచం ఉద్రిక్త,ఉద్వేగ వాతావరణంలో ఉంది. చైనాలో సాంస్కృతిక విప్లవం, అమెరికా లో వియత్నార  యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్య మం, ఫ్రాన్స్‌లో యువతి తిరుగుబాటు,దేశంలో నక్సల్‌బరీ పోరాటం పుంజుకుంటున్న సందర్భ మది. అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగు ల, విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం సకల జనుల ఉద్యమంగా ఎదగలిగింది. ఈ సమ్మె సఫలమైందా, విఫల మైందా, సరియైన సమయంలోనే జరిగిందా ? విఫలమైదా ? అనడానికి మనం ఉపయోగించే ప్రమాణాలు ఏమిటి ? అనేది కూడా ప్రశ్నే. తె లంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం లేదా బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం అనేదే ప్రమాణమై తే సమ్మె తన లక్ష్యాన్ని సాధించలేదు అనవచ్చు. కానీ, సమ్మె చూస్తే పెట్టబడిదారులకు, రాజకీ యాలకు ఏర్పడ్డ అనైతిక సంబంధాన్ని సమ్మె ఎం డగట్టింది. అక్రమ సంపాదన కలిగిన వారు రాజ కీయాలను ఎలా  నిర్దేశిస్తున్నారో తెలంగాణ ప్రజ లకు తెలిసినంత స్పష్టంగా బహుశా ఇతర ఏ ప్రాంతం వారికి తెలసి ఉండదు. అలాగే భిన్న రంగాలకు చెందిన సమస్త వృత్తుల వాళ్లు, విద్యా ర్థులు, రైతులు, ప్రభుత్వోద్యోగుల, ఆటోలు నడు పుకునే వాళ్లతో సహా..ఒక్కరు కాదు ప్రతిరంగం ఉద్యమానికి స్పందించింది. సింగరేణి కార్మికుల్లో వక్తమైన ఐక్యత సాధారణమైన సంఘటన కాదు. అంటే ఉద్యమాలకు నిర్థిష్టమైన గమ్యాలు ఉండడ మే కాదు గమనం కూడా ఉంటుంది.

తాజావార్తలు