చైనా ఉపగ్రహంలో మహిళా వ్యోమగామి
జియుక్వాన్ (చైనా) :
చైనా మొదటి సారిగా శనివారం మహిళా వ్యోమగామి తో కూడిన ఉపగ్రహాన్ని రోదసి లోనికి ప్రయోగించింది. ఇందులో ఇద్దరు పురుష వ్యోయగాములు,ఒక మహిళా వ్యోమగామి ఉన్నారు. గోబి ఎడారి అంచున జిక్యాన్ ఉపగ్రహప్రయోగ కేంద్రం నుంచి సాయంత్రం 6.37 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. గత ఏడాది చైనా స్పేస్ లాబ్ ను ప్రయోగించింది. ప్రస్తుత ఉపగ్రహం షెంఘౌ 9 లోని వ్యోమగాములు ఆ స్పేస్‌లాబ్ లోనికి ప్రవేశించి అక్కడ వారం పాటు పనిచేస్తారు. 2003 లో మొదటిసారిగా చైనా మానవ సహిత ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2005,2008లో వరుసగా ఇలాంటి ప్రయో గాలనే చేసింది..