చౌటుప్పల్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం.. దీమా వ్యక్తం చేసిన జిఎంఆర్..
పటాన్చెరు అక్టోబర్ 12 (జనం సాక్షి)
ఏం పోచమ్మ పింఛన్ వస్తుందా.. ఎంత మంది పిల్లలు.. అందరు బాగున్నారా. అంటూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో 1, 13 వార్డులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఇన్చార్జిగా నియమించారు. ఇందుకు అనుగుణంగా.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 25 మంది ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు వంద ఓట్ల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈనెల 7వ తేదీ నుండి రెండు వార్డుల్లో విస్తృతం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రతి వార్డులో తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చైతన్యవంతులని ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన బిజెపి అభ్యర్థి రాజగోపాల్ కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.