జంటపేలుళ్లకు 11 ఏళ్లు పూర్తి

రేపటి తీర్పు కోసం బాధితుల ఎదురుచూపు

బాధితుల్లో చాలామంది ఇంకా మంచానికే పరిమితం

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్లయినా పురోగతి కానరావడం లేదు. బాధితులు ఇంకా కొందరు మంచానికే పరిమితం అయ్యారు. లుంబినీ పార్క్‌,గోకుల్‌ చాట్‌ జంటపేలుళ్లకు సంబంధించి 11 ఏళ్లు కావస్తోంది. ఈ నెల 27న తుది తీర్పు రానుంది. ఉగ్ర దాడి జరిగి 25నాటికి 11 ఏళల్వుతోంది. ఆనాటి మారణ ¬మం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. లుంబునీ పార్క్‌, గోకుల్‌ చాట్‌ వద్ద జరిగిన బ్లాస్ట్‌ లో 42 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధితులు కోరుకుంటున్నారు. జంట పేలుళ్ల కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఏడుగురి పేర్లతో కూడిన 1125 పేజీలతో మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు. కేసులో మొత్తం 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. మక్కా పేలుళ్ల తరువాత పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టువిచారణలో తేలింది. జంట పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఎండీ సిద్దిఖ్‌ ఇస్సార్‌ అహ్మద్‌, ఎండీ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, అనిక్‌ షఫిఖ్‌ సయ్యద్‌, ఫారుఖ్‌ షర్ఫుద్దీన్‌ తార్కష్‌ లను ముంబయి పోలీసులు మొదట అరెస్టు చేశారు. పీడీ యాక్ట్‌ కింద వీరిని ఆక్టోపస్‌ విభాగం, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఐఎంకు చెందిన అనీఖ్‌, రియాజ్‌ భత్కల్‌, అక్బర్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అవిూర్‌ రజా ఖాన్‌, ఫారూఖ్‌ తర్ఖాష్‌, సాదిక్‌ షేక్‌ లను ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ పేలుళ్లకు ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ ప్లోజీవ్‌ డివైస్‌ .. ఐఈడీలను ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. టిఫిన్‌ బాక్సుల్లో బాంబులను ఉంచి వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపినట్టు గుర్తించారు. జంట పేలుళ్ల కేసులో విచారణ పూర్‌ఖ్తె చార్జీషీట్‌ కూడా వేయడంతో?సోమవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. దీంతో నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జంట పేలుళ్ల బాధితులంతా నిందితులను ఉరితీయాలని కోరుకుంటున్నారు.హైదరాబాద్‌ను వణికించిన జంట బాంబు పేలుళ్లు జరిగి 11 ఏళ్లయ్యింది. ఆగస్టు 25, 2007న నగరంలోని లుంబినీ పార్క్‌ ,గోకుల్‌ చాట్‌ లలో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయి. మొత్తం 42 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు. లుంబినీపార్క్‌లో జరిగిన పేలుడులో 9 మంది చనిపోగా.కోఠీ గోకుల్‌ చాట్‌ బ్లాస్ట్‌ లో 33 మంది మృత్యువాతపడ్డారు. పేలుళ్ల తర్వాత నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్లలో గాయపడిన కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయానక పరిస్థితులను గుర్తుచేసుకుంటూ కన్నీరుపెడుతున్నారు.