జగిత్యాల ఎమ్మెల్యేకు సంజయ్ అనర్హత..

పిటీషన్‌ను కొట్టేసిన స్పీకర్
` పార్టీ మారినట్టు ఆధారాలు లేవని వెల్లడి
` స్పీకర్ తీర్పును స్వాగతించిన సంజయ్
` తాను బీఆరఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆరఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సంజయ్‌పై అనర్హత కోరుతూ బిఆరఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇక, పార్టీ ఫిరాయిపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సంజయ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్.. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్ల విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేకు కూడా క్లిన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే స్పందిస్తూ… ’ నేను బీఆరఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. బీఆరఎస్ పార్టీలోనే గెలిచా. బీఆరఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చా. అసెంబ్లీలో బీఆరఎస్ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టి, విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తా. నేనెప్ప్పుడూ బీఆరఎస్ పార్టీని, అధిష్టానాన్ని విమర్శించలేదు. స్థానిక బీఆరఎస్ నాయకత్వం నాకు దూరంగా ఉంది. నాది ఎలక్షన్ కోసం కాదు.. అభివద్ధి కోసం ఆరాటం. జగిత్యాల అభివద్ధి కోసం సీఎం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా’ అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నా జీతం నుంచి నెలకు రూ. 5 వేలు బీఆరఎస్ పార్టీకి కట్ అవుతున్నాయి. నేను బీఆరఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చానని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ బీఆరఎస్‌లోనే ఉన్నానని కడియం శ్రీహరి చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యానించారు. కడియం నీతులు చెప్పడం ఆపు. నువ్వు కాంగ్రెస్‌లో చేరావని స్పీకర్ ముందు అంగీకరించు. దిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్ప్పుకొని ఇప్ప్పుడు ప్రజలను తప్ప్పుదోవ పట్టిస్తున్నారు. కాలయాపన చేసి అనర్హత నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేవని ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు‘ అని వివేకానంద తెలిపారు.

 

సుప్రీంలో సవాల్ చేస్తాం
స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు
కళ్లముందు కనిపిస్తున్నా సాక్ష్యాలు లేవంటే ఎలా?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌చిట్‌పై కేటీఆర్ ఆగ్రహం
సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని విమర్శ
హైదరాబాద్(జనంసాక్షి):ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆరఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితం అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేయడంపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ విÖడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమైపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని తేలిపోయింది. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదు. పట్టపగలే పది మంది బీఆరఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.
సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్: కేటీఆర్
హైదరాబాద్: సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా విచారణ చేస్తుంటే అనుమానం వచ్చిందని తెలిపారు. ఆరా తీస్తే సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడిందన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విÖడియాతో మాట్లాడారు.“రేవంత్‌రెడ్డి బినావిÖ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చింది. దివాలా తీసిన ఇన్‌ఫ్రా సంస్థకు రూ.6 వేల కోట్ల టెండర్లు ఇచ్చారు. గతంలో రేవంత్‌పై ఐటీ సోదాలు జరిగాయి. ఇన్‌ఫ్రా కంపెనీలో సీఎం పెట్టుబడులు ఉన్నాయి. 2023లోనే కేఎలఎసఆర్ సంస్థ దివాలా తీసింది. ఈ కంపెనీకి ఎందుకు టెండర్లు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ బినావిÖ వ్యవహారం బయటకు రాకుండా చేయాలనే సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు.