జనగాంలో పలు హోటళ్లపై కేసులు నమోదు
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని జనగాం పట్టణంలో పలు హోటళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దాడుల్లో పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 150 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటళ్లకు అక్రమంగా సిలిండర్లను సరఫరా చేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.