*జనగామలో జరిగే రైతు సంఘం జిల్లా రెండవ మహాసభను జయప్రదం చేయండి.. గొల్లపల్లి.

 

 

 

 

 

 

బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి) ఈనెల 22వ తేదీన శనివారం రోజున జనగామ పట్టణంలోని పూసల భవనంలో జరిగే తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి బాబు రెడ్డి పిలుపునిచ్చారు గురువారం రోజున స్థానిక కార్యాలయంలో రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల చేస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశం బండ కింది బాల నారాయణ అధ్యక్షతన జరిగ గా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కార కోసం తెలంగాణ రైతు సంఘం అనేక పోరాటాలు కల్తీ విత్తనాలు ఎరువు పురుగుమందులు బ్యాంకు రుణాలు తాగునీరు పౌల్ట్రీ పాల రైతుల పండ్లు కూరగాయల రైతుల సమస్యల పైన అనేక పోరాటాలు మార్కెట్ ధరల పైన పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం తెలంగాణ రైతు సంఘం అని దేశంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని సాగిన మహత్తర సంవత్సర పోరాటంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్యభూమిక పోషించిందని రైతాంగ ఉద్యమానికి తలవకి కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని అలాంటి పోరాట చరిత్ర కలిగిన రైతు సంఘం పోరాటాల పురిటిగడ్డ జనగామ గడ్డమీద రెండో మహాసభలు నిర్వహిస్తుందని ఈ మహాసభలకు రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రావుల రవీందర్ రెడ్డి, అట్ల దామోదర్ రెడ్డి, గుండ నరసింహులు కొమ్మాట రఘుపతి ,శ్రీశైలం ,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు