జనగామలో సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు
జనగామ,అక్టోబర్16(జనంసాక్షి): జనగామ జిల్లాలో తొలిసారిగా వచ్చిన బతుకమ్మ వేడుకులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలాగే జనగామలో సద్దుల బతుకమ్మ వేడుకలను భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగే సద్దుల బతుకమ్మను గతంలో కన్నా వైభవంగా జరిపేందుకు కలెక్టర్ కృష్ణారెడ్డి చర్యలు తీసుకున్నారు. బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మ, దసరాను పండుగలను స్నేహపూరితంగా, అన్నాదమ్ముల్లా కలిసి, మెలసి నిర్వహించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిగకుండా చూడాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆయా గ్రామాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మ,
దసరా పండుగలను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌లో శాంతి సమావేశ కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. పండుగల సందర్భంగా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. నేటి సద్దుల బతుకమ్మకు అన్ని గ్రామాలు ముస్తాబవుతున్నాయి.