సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం-అధ్యక్షురాలు బడికె ఇందిరా

జనగామ (జనం సాక్షి) జూలై29:

టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆదేశాల మేరకు జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అనంతరం జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగలా కల్యాణి మున్సిపల్ కౌన్సిలర్ లు జక్కుల అనిత బాల్దే కమలమ్మ జనగామ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ బచ్చనపేట మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు వేణు వందన సిద్ధేంకి గ్రామ సర్పంచ్ సుంకరి నిర్మల స్టేషన్ ఘణపురం మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చింత జోష్ణ జఫర్ గడ్ మండల మహిళ అధ్యక్షురాలు పోనగంటి శ్రీవాణిమాట్లాడుతూ
పార్లమెంటు లోపల కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉద్దేశపూర్వకంగా విమర్శించారు,ఎంపీ అదిరంజన్ చౌదరి రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని పొరపాటున మాట్లాడడం జరిగింది దానికి ఎంపి క్షమాపణ కూడా చెప్పారు,కానీ బిజెపి కేంద్రమంత్రి శృతీ ఇరానీ సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు పార్లమెంటులో మాట్లాడడం జరిగింది, స్మృతి ఇరాని కూతురు కేసును పక్కతోవ పట్టించాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ స్మృతి ఇరానీ దిష్టిబొమ్మ దహనం నిరసన చేపట్టడం జరిగింది అనిసోనియా గాంధీ నాయకత్వనికి వ్యతిరేకంగా అసభ్యకరంగా అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించి మాట్లాడడాన్ని బిజెపి ప్రభుత్వం ఈడి అనే సాకుతో ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు దేశ ప్రజలు చూస్తున్నారు బిజెపి ప్రభుత్వానికి వారే బుద్ధి చెబుతారు వెంటనే స్మృతి ఇరాని సోనియా గాంధీ కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జనగామ మండల అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి జక్కుల వేణుమాధవ్ జిల్లా నాయకులు కట్ట కృష్ణ బడికె కృష్ణస్వామి పట్టురి శ్రీనివాస్ కాముని శ్రీనివాస్ ఎమ్. డి.మాజిద్ జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతిష్ గాడిపెళ్లి సక్కుబాయి ప్రసాద్
రవీందర్ గౌడ్ బిర్రు నరసింహులు లింగాల నర్సిరెడ్డి వట్నాల రామకృష్ణ దేవులపల్లి నారాయణ గదే అనిల్ గుజ్జుల మధు . ఫయాజ్ కందుల రాజు బాల్నే నరేష్ తాండ్ర విజయ్ బత్తిని నిఖిల్ సౌడ మహేష్ అజం బెజడి హరీష్ తదితరులు ఉన్నారు