జనగామ జిల్లాను పరిపాలించే హక్కు ఇతరులకు లేదు…. బెజాడి
బచ్చన్నపేట( జనం సాక్షి) ఆగస్టు 30 జనగామ జిల్లా లో ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు స్థానికేతరులకు లేదని బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలం లోని సాల్వపూర్ గ్రామం లోని యువతకు క్రికెట్ కిట్ల ను అందజేసిన . అనంతరం వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలు ఒక్క తాటి పైకి రావాల్సి ఉందని అన్నారు. స్థానికేతరులు జనగామ జిల్లా ప్రజలను పరిపాలించే హక్కు వారికి లేదని అన్నారు. నియోజకవర్గంగా రెండు లక్షల 30 వేల ఓట్లు కలిగిన జనగామ నియోజకవర్గాన్ని ఒక భూకబ్జారుడు అయినటువంటి ఎమ్మెల్యే జనగామ ప్రజలను పరిపాలించే అధికారాన్ని కోల్పోయాడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జనగమ ప్రజలు స్థానికంగా ఉన్న నాయకులను ఎన్నుకోవాలని ఆయన కోరారు. జనగామను ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని టిఆర్ఎస్ పార్టీకి సవాల్ విసరారు. జనగామలో అభివృద్ధి జరిగింది ఏంది అంటే భూ కబ్జాలు, హత్య రాజకీయాలు బెదిరింపులు తప్ప జనగామ జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు రెండుసార్లు పట్టభద్రులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అంట్టున్నడు.ప్రజలారా ఒక్క సారి అడగండి జనగామ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఎంతమందికి ఉపాధి కల్పించాడు. జనగామ కు ఎన్ని ఫార్మా కంపెనీలు తీసుకొచ్చాడో అని. ప్రజలు అడగాలని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎప్పుడు కలిశాడో చెప్పాలని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రపంచానికే దిక్సూచిగా ఉందని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయని తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేయాలని ఆయన కోరారు. తెలంగాణలో వచ్చేది కూడా డబుల్ ఇంజన్ సర్కారేనని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి, బూత్ అధ్యక్షుడు చిర్ల మల్లేశం, మండల కార్యవర్గ సభ్యుడు గుడిపు కనకయ్య, నాయకులు చీర్ల కృష్ణ., చారి,తిరుపతి గౌడ్, సిగ్గరెయ్య గౌడ్, మరియు గ్రామ యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.