జపాన్‌ చేరుకున్న ప్రధాని

ప్రగతి ఒప్పందాలే లక్ష్యం
టోక్యో/న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) : భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం జపాన్‌ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఆయనకు ఆదేశ విదేశాంగ శాఖ అధికారులు ఘన స్వాగ తం పలికారు. జపాన్‌ ప్రధాని షింజో ఎబితో మన్మోహన్‌సింగ్‌ బుధవారం విస్తృతస్థాయి చర్చలు జరుపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు  మెరుగు పరచడమే ఏజెండాగా ప్రధాని పర్యటన సాగనుంది. పౌర అణు ఇంధన సహకారానికి సంబంధించి ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకోనున్నాయి.