జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం నేడు జిల్లా కలెక్టర్ కు వినతి….

జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి..
టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు పిట్టల మధుసూదన్
ములుగు బ్యూరో,అక్టోబర్09(జనం సాక్షి):-
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేడు (సోమవారం) జర్నలిట్స్ట్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తు,జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు పిట్టల మధుసూదన్ పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని చెప్పారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్టోబర్ 10న డిమాండ్స్ డే ను చేపట్టినట్టు వివరించారు.డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వాలని జర్నలిస్టులకు సూచించారు. కలెక్టరేట్ ముందు శాంతియుత ప్రదర్శనలు చేయాలని కోరారు.బ్యానర్లు, ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని డిమాండ్స్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మధుసూదన్ కోరారు.