జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీలకు 8 మంది బాల బాలికలు ఎంపిక

బాల బాలికలను సన్మానించిన ఎమ్మెల్యే
మక్తల్ ఆగస్టు 01 (జనంసాక్షి) జులై 31న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ లో క్రీడల్లో పాల్గొని జాతీస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు 8 మంది బాల బాలికలు ఎంపికైనట్లు జిల్లా అధ్యక్షుడు జి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విశ్రాంత పీఈటి బి.గోపాలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన బాల బాధితులను పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే బాలికలను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 మంది జాతీయ సాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు జాతీయస్థాయిలో ఆడి బంగారు పతకాలు పొందాలని సూచించారు. క్రీడాకారులకు నా వంతు పూర్తి సహకారం, ప్రోత్సాహ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, టిఆర్ఎస్ నాయకులు మహిపాల్ రెడ్డి , రవిశంకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి , నేతాజీ రెడ్డి, పీఈటీలు అమ్రేష్ , దామోదర్, రమేష్, తిరుపతమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.