జార్ఘండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

4
-12 మంది మవోయిస్టుల మృతి

రాంచీ,జూన్‌9(జనంసాక్షి):

ఇంతకాలం మావోలదే పట్టుగా ఉన్న దశలో పోలీసులు పైచేయి సాధించారు. ఝార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో కనీసం 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మావోల రహస్య ప్రాంతం తెలుసుకుని అక్కడికి వెల్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పలము జిల్లాలోని సత్‌బర్వ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్థరాత్రి 2.30గంటల సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో  ఘటనాస్థలిలో లభ్యమైన అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సత్‌బర్వ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహస్య ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న భద్రతాబలగాలు వారిని చుట్టుముట్టారు. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో, భద్రతా బలగాలు కూడా కాల్పులకు దిగాయని అధికారులు వెల్లడించారు. గాయపడిన భద్రతా సిబ్బందిని సవిూపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలము జిల్లాలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.