పాడిపరిశ్రమ పెద్దపీట

` గోకుల్‌ మిషన్‌ కింద రూ.3,400 కోట్ల కేటాయింపు
` అసోంలో రూ. 10,601 కోట్ల పెట్టుబడితోయూరియా కాంప్లెక్స్‌
` మహారాష్ట్రలో ఆరులేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మాణం
` కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలు
న్యూఢల్లీి(జనంసాక్షి):పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్టీయ్ర్ర గోకుల్‌ మిషన్‌ కింద రూ.3,400 కోట్ల నిధులను కేటాయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మరి కొన్ని నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పాడి పరిశ్రమ, ఎరువుల పరిశ్రమలను బలోపేతం చేయడంతో పాటు- డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి రూ.16,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విూడియాకు వెల్లడిరచారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు- దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్టీయ్ర గోకుల్‌ మిషన్‌ కింద రూ.3,400 కోట్ల నిధులు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. అలాగే.. అస్సాంలోని నమ్రూప్‌లో రూ. 10,601 కోట్ల పెట్టుబడితో కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ అమ్మోనియా-యూరియా కాంప్లెక్స్‌ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్‌ ఏటా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయడం లక్ష్‌యంగా పెట్టుకుందని తెలిపారు. ఎరువుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఈశాన్య ప్రాంతంలోని రైతులకు సకాలంలో ఎరువులు అందేందుకు ఇది ఉపయోగపడుతోందన్నారు. పగోట్‌ను మహారాష్ట్రలోని చౌక్‌తో అనుసంధానించడానికి రూ.4,500 కోట్ల పెట్టుబడితో 6 లేన్ల యాక్సెస్‌-కంట్రోల్డ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైస్పీడ్‌ నేషనల్‌ హైవే నిర్మాణానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్‌ బ్యాంక్‌, ఫిన్‌టెక్‌ సంస్థ, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, యాప్‌ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్‌ రూపంలో చిన్న లావాదేవీలకు చార్జి లేకుండా చేస్తున్నామన్నారు. మరోవైపు మహారాష్ట్రలో రూ.4,500. 62 కోట్లతో 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలని ఈ కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్లు వెల్లడిరచారు.ఈ రహదారి సరకు రవాణాలో ఎంతో ప్రయోజనకార ప్రాజెక్టుగా మారనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.