రష్యా దాడులు ఆపడం లేదు
` ట్రంప్` పుతిన్ చర్చల్లో ఏం జరిగిందనేది తెలుసుకుంటాను
` ఈ విషయమైన అమెరికా అధ్యక్షుడుడితో త్వరలో భేటి అవుతాను:జెలెన్‌స్కీ
కీవ్(జనంసాక్షి): రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజులు పాటు దాడులు నిలిపివేసేలా యూఎస్, మాస్కోల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా సుదర్ఘీమైన పోస్ట్ పెట్టారు.‘నిజంగా రష్యా ఏం కోరుకుంటుందనేదీ ఈ దాడులతో తెలిసిపోతుంది. దాదాపు 40 డ్రోన్లు మా భూభాగాన్ని తాకాయి. దురదృష్టవశాత్తూ పౌరుల మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. సుమీలోని ఆస్పత్రితో పాటు కీవ్, జటోమిర్, చెర్నిహివ్ తదితర ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయి. మా ఇంధన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మాస్కో అర్ధరాత్రి వేళ దాడులు చేయడం సరైనది కాదు. ఉక్రేనియన్ల సాధారణ జీవితానికి ఇవి విఘాతం కలిగిస్తాయి. యుద్ధాన్ని పొడిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచాధినేతలు స్పందించడం సరైనదే’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈసందర్భంగా రష్యా శాంతిని కాంక్షించే ఇలాంటి దాడులు చేస్తుంది కదా..! అని జెలెన్‌స్కీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక, ఈ దాడులపై జర్మన్ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ స్పందించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడంపై పుతిన్ ఆటలాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తాజా దాడులపై ట్రంప్ కచ్చితంగా స్పందించాలన్నారు.రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత లను ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో దీనిపై ఇటీవల చర్చలు జరిగాయి. అందులో 30 రోజుల కాల్పుల విరమణను అమెరికా ప్రతిపాదించగా.. ఉక్రెయిన్ అంగీకరించింది. అయితే, రష్యా సూత్రప్రాయంగా ఒప్పుకుంది. మంగళవారం ట్రంప్, పుతిన్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈక్రమంలో ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజుల పాటు దాడులు ఆపాలని ట్రంప్ సూచించగా.. పుతిన్ దానికి అంగీకరించారు. ట్రంప్ సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిరచారు. పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారమే అప్పగించుకోనున్నట్లు ట్రంప్‌నకు పుతిన్ చెప్పారని క్రెమ్లిన వెల్లడిరచింది. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికుల్ని కూడా రష్యా అప్పగించనుందని తెలిపింది. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఉక్రెయిన్‌కు చేస్తున్న సైనిక సాయాన్ని ఆపేయాలని పుతిన్ పట్టుబట్టినట్లు క్రెమ్లిన్ వెల్లడిరచింది. చర్చలకు ఉక్రెయిన్ సమ్మతి ఉందా, లేదా అనేది తెలియరాలేదు.ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధాన్ని నివారించేందుకు..కీవ్‌లో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. చర్చల్లో పుతిన్ ఏమి మాట్లాడారనే విషయాన్ని తెలుసుకోవడానికి తాను త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని పేర్కొన్నారు. ‘’రష్యాతో చర్చల విషయంలో ఈ రోజు ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతాను. యుద్ధ నివారణకు తదుపరి చర్యల గురించి తెలుసుకుంటాను’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజులు పాటు దాడులు నిలిపివేసేలా యూఎస్, మాస్కోల మధ్య అంగీకారం కుదిరినా.. రష్యా కీవ్‌పై వరుస డ్రోన్ దాడులకు పాల్పడుతుందని జెలెన్‌స్కీ ఆరోపించారు. పుతిన్ చర్యలు ఈ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. దీని ద్వారా ఆ దేశం ఏమి కోరుకుంటుందనే విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగితే ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్యగా ఉంటుందన్నారు.రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత లను ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా.. అందుకు కీవ్ అంగీకారం తెలిపింది. పుతిన్ సైతం సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. యుద్ధం ముగింపు విషయంపై మంగళవారం ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు.