అడవిలో మరోసారి అలజడి

బీజాపూర్‌ (జనంసాక్షి) : చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. గంగులూరు పీఎస్‌ పరిధి అండ్రి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇరువురి మధ్య ఉధృతంగా కాల్పులు కొనసాగుతున్నాయి. భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనలో ఓ జవాన్‌ కూడా మృతిచెందారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్‌ నిర్వహించినట్టు సమాచారం.