వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్‌

` ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడంలో బహీనంగా మారిన వ్యోమగాములు
` కండరాల క్షీణత, సరిగా నిలబడలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయన్న నిపుణులు
` వైద్యపరీక్షలు, ఆరోగ్య పరిస్థితి కారణంగానే సునీతా విలియమ్స్‌ అందుకే వైట్‌హౌస్‌కు పిలవలేదు: ట్రంప్‌
ఫ్లోరిడా(జనంసాక్షి):ఇన్నాళ్లుగా యావత్‌ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడిరది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ సురక్షితంగా భూమి విూద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ క్రూ కాప్సూల్‌ ఫ్లోరిడా తీరానికి సవిూపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతా, బుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు తొలుత సునీతా, బుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం స్టెచ్చ్రర్ల్రపై తరలించారు. ఐఎస్‌ఎస్‌లోని సూక్ష్మస్తాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ ల్యాండిరగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక సునీతా విలియమ్స్‌ ల్యాండిరగ్‌కు సంబంధించి 2013లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ గ్రావిటీ- సినిమాకు గుర్తుకుతెచ్చింది. 2013లో హాలీవుడ్‌ నుంచి వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం గ్రావిటీ. ఈ సినిమాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ సాండ్రా బుల్లక్‌ కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్‌ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో సాండ్రా బుల్లక్‌ అంతరిక్షం నుంచి భుమికి ల్యాండ్‌ అయిన సన్నివేశం ప్రస్తుతం సునీత విలియమ్స్‌ ల్యాండిరగ్‌ను గుర్తుకుతెస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా గమనిస్తారు. వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని నానా వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే కుటుంబ సభ్యులు వారిని కలుసుకునేందుకు అనుమతిస్తారు. ఇక అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను కూడా నాసా రికార్డు చేయనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు వంటివన్నీ తెలుసుకుని నాసా అధికారులు రికార్డు చేసుకుంటారు. చివరిగా వ్యోమగాములను తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇస్తారు. భూవ్మిూదకు వచ్చాక తాను ముందుగా కుటుంబసభ్యులతో పాటు పెంపుడు శునకాలను కూడా చూడాలనుకుంటున్నట్టు- సునీతా విలియమ్స్‌ ఇటీవల పేర్కొన్నారు. గతేడాది బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలల పాటు- చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

ఆరోగ్య పరిస్థితుల దృష్టా సునీతాను వైట్‌హౌస్‌కు పిలవలేదు: ట్రంప్‌
న్యూయార్క్‌(జనంసాక్షి):సుదీర్ఘ నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు అంతరిక్షం నుంచి పుడమికి చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌. వీరిని రోదసి నుంచి తీసుకొచ్చిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరింది. దీంతో యావత్‌ ప్రపంచం వీరికి సాదర స్వాగతం పలికింది. వీరి రాకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. వ్యోమగాములను వైట్‌హౌస్‌కు ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.‘’వారు ఇన్నాళ్లూ అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ మన శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయి. శరీరం తేలికగా మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఆ పరిస్థితుల నుంచి భూమికి చేరుకున్నారు. ఇక్కడి వాతావరణానికి మళ్లీ అలవాటుపడటం అంత సులువు కాదు. అందుకే వారిని ఇప్పుడే శ్వేతసౌధానికి ఆహ్వానించలేదు. ఇంకా చాలా సమయం ఉంది. వాళ్ల పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవల్‌ ఆఫీసుకు పిలుస్తా’’ అని ట్రంప్‌ వెల్లడిరచారు.అంతకుముందు ఈ వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకోవడంపై శ్వేతసౌధం సోషల్‌ మీడియాలో స్పందించింది. ‘’హామీ ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ట్రంప్‌ సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఇందుకు సహకరించిన ఎలాన్‌ మస్క్‌, స్పేస్‌ ఎక్స్‌, నాసాకు కృతజ్ఞతలు’’ అని వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధి రాసుకొచ్చారు.దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు పుడమిని చేరుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్‌.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి రావడం గమనార్హం.

 

త్వరలోనే సునీత భారత్‌కు వస్తుంది
` కుటుంబసభ్యుల వెల్లడి
అహ్మదాబాద్‌(జనంసాక్షి): సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి పుడమిని చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌. తొమ్మిది నెలల పాటు రోదసిలో చిక్కుకుపోయిన సునీత బుచ్‌ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ‘ఫ్రీడమ్‌’..బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది. వారి రాకను ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆమె క్షేమంగా భూమిని చేరుకోవడంతో భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడారు. ఆమె త్వరలోనే భారత్‌కు వస్తుందని తెలిపారు.9 నెలల ఎదురుచూపుల తర్వాత సునీత సురక్షితంగా తిరిగిరావడంతో గుజరాత్‌లోని రaూలాసన్‌లో ఆమె బంధువులు, గ్రామస్థులు బాణసంచా కాల్చి డ్యాన్స్‌లు చేశారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘’సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం’’ అని తెలిపారు.ఇక, ఇప్పుడంతా సునీతకు ఫ్యామిలీ టైమ్‌ అని ఫాల్గుణి పేర్కొన్నారు. త్వరలోనే ఆమె భారత్‌కు రానున్నట్లు సూచనప్రాయంగా వెల్లడిరచారు. ‘’మేమంతా కలిసి వెకేషన్‌ ప్లాన్‌ చేస్తున్నాం. సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఆమెతో టచ్‌లోనే ఉన్నాం. ఇటీవల నేను మహాకుంభమేళాకు వెళ్లగా ఆ విశేషాలను రోదసి నుంచే అడిగి తెలుసుకున్నారు’’ అని వెల్లడిరచారు.అంతకుముందు ప్రధాని మోదీ కూడా సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెకు లేఖ రాసిన ప్రధాని.. ‘’మీరు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం. తన కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్‌ సంతోషంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్‌ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీలకు 1965 సెప్టెంబర్‌ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్‌ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు.